స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో కొత్త ఫోన్ వచ్చి చేరింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 8జీబీ ర్యామ్, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్ అతి తక్కువ ధరకే లభ్యం కానుంది. ఇవాళ్టి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్న ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు మీ కోసం.
అద్భుతమైన కెమేరా, ప్రీమియం ఫీచర్లతో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మీ కోసం అలాంటి ఫోన్ ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ ఇది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ కొత్తగా Honor X7C 5G లాంచ్ చేసింది. మొన్న ఆగస్టు 18న లాంచ్ అయిన ఈ ఫోన్ విక్రయాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చెక్ చేద్దాం.
Honor X7C 5G ఫీచర్లు, ధర వివరాలు
Honor X7C 5G ఫోన్ 6.8 ఇంచెస్ టీఎఫ్టీ ఎల్సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2412/1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తోంది. 4ఎన్ఎం ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రోసెసర్‌తో ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే డ్యూయల్ రేర్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమేరా ఉంటాయి. ఈ ఫోన్ 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లాంచింగ్ ధర 14,999 రూపాయలుగా ఉంది. ఇది స్పెషల్ లాంచింగ్ ధర మాత్రమే. రెండ్రోజులుంటుంది. అది కూడా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్‌కే వర్తిస్తుంది. ఇక 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. మార్కెట్ లో OPPO 13X G ఫోన్‌తో ఇది పోటీ పడనుంది. ఇతర బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే 5-10 శాతం క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా వర్తించవచ్చు.