కళ్లు చెదిరే ఫీచర్లు, అద్భుతమైన కెమేరా రిజల్యూషన్‌తో వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్ VIVO X100 Pro అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా 31 వేలు తగ్గింపు లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఈ ఫోన్ 6.78 ఇంచెస్ ఎల్టీపీవో కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కావడంతో పనితీరు చాలా వేగంగా ఉంటుంది.
ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 989 సెన్సార్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమేరా, 50 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్‌పై రన్ అవుతుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండి 5400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.
VIVO X100 Pro ప్రారంభధర 89,999 రూపాయలు కాగా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా 31,500 రూపాయలు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కేవలం 59,990 రూపాయలకే లభించనుంది. ఇక హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 1500 రూపాయలు తగ్గింపు ఉంటుంది. దాంతో 58,490 రూపాయలు ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కూడా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు. ఇదే మంచి అవకాశం