ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టించే పనిలో ఉన్నాడు. టెస్టుల్లో స్మిత్ కి రికార్డులు కొత్తేమి కాదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో చేసిన సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ క్రమంలో పలు రికార్డులని సృష్టించిన ఈ ఆసీస్ బ్యాటర్.. టీమిండియాపై సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా స్టీవెన్ స్మిత్ సెంచరీతో సత్తా చాటాడు. ప్రతిష్టాత్మక ఈ ఫైనల్లో సెంచరీ చేసి టెస్టు క్రికెట్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. తొలి రోజు భారత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్మిత్.. ఆటముగిసే సమయానికి 95 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా తన సెంచరీ మార్క్ ని పూర్తి చేసుకొని వ్యక్తిగత స్కోర్ 121 పరుగుల వద్ద శార్ధూల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. స్మిత్ కెరీర్ లో ఇది 31 వ సెంచరీ. ఈ క్రమంలో పలు రికార్డులని సృష్టించిన ఈ ఆసీస్ బ్యాటర్.. టీమిండియాపై సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టించే పనిలో ఉన్నాడు. టెస్టుల్లో స్మిత్ కి రికార్డులు కొత్తేమి కాదు. కానీ డబ్ల్యూటీసీ ఫైనల్లో చేసిన సెంచరీ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ క్రమంలో ఏకంగా ఓ అరడజన్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ మీద అత్యధిక సెంచరీలు చేసిన వారి లిస్టులో బ్రాడ్ మన్(11) తర్వాత స్థానంలో నిలిచాడు. స్మిత్ కి ఇంగ్లాండ్ మీద ఇది 7 వ సెంచరీ. ఇక ఒవెల్ క్రికెట్ గ్రౌండ్ లో 512 పరుగులు చేసి బ్రాడ్ మన్(553) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఇక భారత్ మీద 9 సెంచరీలు చేసి రూట్ తో కలిసి సంయక్తంగా అగ్ర స్థానంలో ఉన్నాడు. స్మిత్ సెంచరీకి తోడు హెడ్ కూడా భారీ సెంచరీ నమోదు చేయడంతో ఆసీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. మరి స్మిత్ నెలకొల్పిన రికార్డులు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.