క్రికెట్ అంటే కేవలం మగాళ్ల ఆట కాదు… మన తెలుగు ఆడబిడ్డలు తలుచుకుంటే ప్రపంచ రికార్డులు సైతం తలవంచాల్సిందేనని నిరూపించింది ఓ తెలుగు అమ్మాయి.. టీ-20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ సాధించని అద్భుతాన్ని చేసి చూపించింది. ఆస్ట్రేలియా గ్రేట్ బౌలర్ల పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టి, గ్లోబల్ క్రికెట్ రికార్డు బుక్స్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకుంది తెలుగుతేజం శ్రీచరణి…
భారత మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికలపై దూసుకెళ్తున్న తరుణంలో, రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్ ఫైనల్ మ్యాచ్ భారత్కు చిరస్మరణీయంగా నిలిచింది. ఈ మహాపోరులో మన తెలుగు తేజం శ్రీచరణి స్పీన్ బౌలింగ్ తో చెలరేగిపోయింది. అత్యంత కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ రెండు వికెట్లు పడగొట్టింది. కేవలం వికెట్లు తీయడమే కాదు, ఆమె వేసిన ప్రతి బంతి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది. ఆ ఏషియన్ గేమ్స్ ఫైనల్ పోరులో శ్రీచరణి చూపిన మ్యాజిక్, కేవలం ఆ మ్యాచ్ను గెలిపించడమే కాకుండా, ఆమె కెరీర్ను అంబరాన్ని తాకేలా చేసింది. ఆ అద్భుత ప్రదర్శనే ఆమెను నేరుగా ప్రపంచ శిఖరాగ్రానికి చేర్చింది.
ఇప్పుడు క్రికెట్ ప్రపంచం అంతా శ్రీచరణి గురించే మాట్లాడుకుంటోంది. తాజా టీ-20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో శ్రీచరణి సాధించిన రేటింగ్ పాయింట్లు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! ఏషియన్ గేమ్స్ ప్రదర్శనతో ఆమె రేటింగ్ పాయింట్లు ఏకంగా 817కి చేరాయి. ఇంతకుముందు 2018లో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ బౌలర్ మేగన్ పేరిట ఉన్న 806 రేటింగ్ పాయింట్ల ఆల్ టైమ్ రికార్డును శ్రీచరణి తాజాగా బ్రేక్ చేసింది. టీ-20 చరిత్రలో హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించిన నంబర్ వన్ బౌలర్గా సరికొత్త అధ్యయాన్ని లిఖించింది.. ప్రస్తుతం ఐసీసీ టీ-20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానంలో శ్రీచరణి కొనసాగుతుండగా, రెండో స్థానంలో మరో భారత ఆల్రౌండర్ దీప్తీ శర్మ (754 పాయింట్లు) ఉండటం మన దేశ బౌలింగ్ దళం ఎంత స్ట్రాంగ్గా ఉందో చాటుతోంది.”
మహిళ బౌలర్గా ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభమేమీ కాదు. ఎన్నో ఏళ్ల కఠిన శ్రమ, నిరంతర సాధన, కుటుంబం అందించిన ప్రోత్సాహం వెనుక ఉన్నాయి. ఒక తెలుగు కుటుంబం నుంచి వచ్చి, అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి, ఆపై ప్రపంచ స్థాయి బ్యాటర్లను భయపెట్టే స్థాయికి ఎదిగారంటే అది సాధారణ విషయం కాదు. తన అంచలంచెల ఎదుగుదలతో దేశం గర్వించేలా చేసిన శ్రీచరణి, తెలుగు క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచారు. పట్టుదల ఉంటే ఏ గమ్యమైనా చేరుకోవచ్చని ఆమె తన బౌలింగ్తో నిరూపించి చూపించారు.”
ఒక కాలంలో మన దగ్గర క్రికెట్ అంటే కేవలం అబ్బాయిల ఆట అనే భావన ఉండేది, అమ్మాయిలు ఆటకు దూరంగా ఉండేవారు. కానీ కాలం మారింది. సరిహద్దులను చెరిపేస్తూ మన తెలుగమ్మాయిలు నేడు గ్లోబల్ స్టేజ్పై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. గతంలో క్రికెట్ అంటే భయపడే, లేదా ఆసక్తి ఉన్నా అవకాశాలు రాని ఎంతోమంది తెలుగు అమ్మాయిలకు నేడు శ్రీచరణి ఒక రోల్ మోడల్గా నిలుస్తున్నారు. కష్టపడితే ఆకాశమే హద్దు అని నిరూపించిన మన తెలుగు తేజం శ్రీచరణి సాధించిన ఈ అరుదైన ఘనత ప్రతి ఒక్క భారతీయుడిని గర్వపడేలా చేస్తోంది.
