క్రికెట్ అభిమానుల హై వోల్టేజ్ మ్యాచ్‌లు మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. మ్యాచ్‌లు ఎలా ఉంటాయో గానీ యాడ్స్ మాత్రం వోల్టేజ్ ఎక్కువై షాక్ కొడుతున్నాయి. సోనీ టీవీ ప్రకటనల ధరలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ప్రత్యక్ష ప్రసారం హక్కుల్ని కైవసం చేసుకున్న సోనీ టీవీ విడుదల చేసిన ప్రకటనల ధరలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకూ జరిగే ఆసియా కప్ టోర్నీలో యాడ్స్ టారిఫ్ కనకవర్షం కురిపించనుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ టీవీలో ప్రకటనల ధరలు విడుదల చేసింది. మ్యాచ్‌ల సంగతేమో గానీ ప్రకటనల టారిఫ్ మాత్రం హై వోల్టేజ్ షాక్ ఇస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ సహా 8 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లంటే మామూలుగా ఉండదు. అందుకే టారిఫ్ రేట్ల అమాంతం పెంచేసింది సోనీ టీవీ యాజమాన్యం.
ఆసియా కప్ 2025 టీవీ ప్రకటనల టారిఫ్ ఇలా
ఇండియా ఆడే మ్యాచ్‌లలో 10 సెకన్ల ప్రకటనకు 14-16 లక్షలు
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 10 సెకన్ల ధర 16 లక్షలు
కో ప్రజెంటింగ్ స్పాన్సర్‌షిప్ 18 కోట్లు
అసోసియేట్ స్పాన్సర్‌షిప్ 13 కోట్లు
డిజిటల్ టారిఫ్
కో ప్రజెంటింగ్ , హైలైట్స్ పార్టనర్ 30 కోట్లు
కో పవర్డ్ బై ప్యాకేజీ 18 కోట్లు
ప్రీ రోల్ యాడ్స్ 10 సెకన్లకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు 750 రూపాయలు
ప్రీ రోల్ యాడ్స్ సాధారణ మ్యాచ్‌లకు 275 రూపాయలు
ప్రీ రోల్ యాడ్స్ ఇండియా మ్యాచ్‌లకు 500 రూపాయలు
మిడ్ రోల్ యాడ్స్ 225 నుంచి 600 రూపాయలు
కనెక్టెడ్ టీవీ యాడ్స్ 450 నుంచి 1200 రూపాయలు
వాస్తవానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనగానే ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ స్థాయిని దాటిపోతుంటాయి. హై వోల్టేజ్ మ్యాచ్ కావడంతో పాటు దీపావళికి ముందు జరగనుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ కంపెనీలు సరైన వేదికగా భావిస్తాయి. బ్రాండ్ ప్రచారం కోసం కోట్లలో ఖర్చుపెట్టేందుకు వెనుకాడరు. పెట్టిన ప్రతి పైసా పెట్టుబడికి రిటర్న్ వస్తుందనే నమ్మకం ఉంటుంది. కేవలం క్రికెట్ పోటీల వేదికగా కాకుండా వాణిజ్య అవకాశాలకు కేరాఫ్‌గా మారుతుంటాయి. అందుకే ఈ మ్యాచ్‌లలో యాడ్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది.