వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ బ్యాటింగ్‌లో విఫలమైనా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సంజూ బ్యాటింగ్ చేయకున్నా.. తన అద్భుతంగా కీపింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. చివరి బంతి వరకు నరాలు తెగ ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటూ అందుకు సంజూనే అసలు కారణమని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సంజూ డైవ్ కొట్టి బంతిని ఆపకపోయి ఉంటే మ్యాచ్‌తో పాటు పరువు కూడా పోయి ఉండేదని అంటున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ శిఖర్ ధావన్(99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు), శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 పరుగులు), శ్రేయస్ అయ్యర్(57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులు) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. మ్యాచ్‌కు ముందు 50 ఓవర్లు బ్యాటింగ్ చేస్తేనే గొప్ప అని భావించిన వెస్టిండీస్ జట్టు.. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ విజయం వైపు దూసుకెళ్లింది.
ఈ క్రమంలో విండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా.. మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకున్నాడు. క్రీజులో అప్పటికే భారీ షాట్లతో విరుచుకుపడుతున్న రోమారియో షెఫర్డ్, అకేల హోస్సెన్ ఉన్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన కరేబియర్ క్రికెటర్లకు చివరి ఓవర్‌లో 15 పరుగులు చేయడం పెద్ద విషయం కాదు. దీంతో విండీస్ గెలుపు ఖాయంగా కనిపించింది. కానీ.. తొలి బంతిని డాట్ వేసిన సిరాజ్.. రెండో బంతికి సింగిల్, మూడో బంతికి బౌండరీ ఇచ్చాడు.
నాలుగో బంతికి షెఫర్డ్ 2 పరుగులు తీయగా.. ఐదో బంతిని సిరాజ్ భారీ వైడ్ వేశాడు. అది కాస్త వికెట్లకు చాలా దూరంగా వెళ్లడంతో కీపర్ సంజూ శాంసన్ సూపర్ డైవ్‌తో అడ్డుకొని 4 పరుగులు సేవ్ చేశాడు. బంతిని కనుక సంజూ ఆపకపోయి ఉంటే వైడ్ ప్లస్ బౌండరీతో కలిపి మొత్తం 5 పరుగులు విండీస్ ఖాతాలో ఉత్త పుణ్యానికి చేరేవి. దీంతో వెస్టిండీస్ విజయానికి రెండు బంతుల్లో 3 పరుగులు మాత్రమే అవసరం అయ్యేవి.
కానీ సంజూ సూపర్ డైవ్‌తో 2 బంతుల్లో 7 పరుగుల చేయాల్సిన తరుణంలో కెప్టెన్ ధావన్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెట్ చేయడంతో విండీస్ బ్యాటర్లు మూడు పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయ్యారు. కాగా సంజూ సూపర్ కీపింగ్‌ను సిరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లు, కామెంటేటర్లు ప్రశంసించారు. ప్రస్తుతం సంజూ డైవ్ చేస్తూ బౌండరీ సేవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Save OF the MATCH 💥🔥#Sanjusamson #INDvWI@IamSanjuSamson ❤️🔥 pic.twitter.com/nC16Womm77
— Vishnudath K (@VishnudathK) July 23, 2022
The save from Sanju Samson made a huge impact on the victory of the Indian team, it was a certain 4 extra runs for West Indies & they could have won the game. pic.twitter.com/wxcDLVqY29
— Johns. (@CricCrazyJohns) July 22, 2022