నిలబడితే మ్యాచ్ ముగించే వరకు ఆడే ఓపెనర్లు, టీ20ల్లో వాళ్లే టాప్ బ్యాటర్లు. బలమైన మిడిల్డార్.. సిక్సులు మాత్రమే కొట్టే ఫినిషర్లు, బ్యాటర్లును తమ స్పీడ్‌తో బెంబేలెత్తించే పేసర్లు.. ఇలా ఏ విభాగంలో చూసుకున్న పాకిస్థాన్ టీ20 టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. త్వరలో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధమవుతున్న మరే జట్టు కూడా ఇంత బలంగా కనిపించడం లేదు. వరల్డ్ కప్ హాట్‌ఫేవరేట్ టీమ్స్‌లో పాకిస్థాన్ ఒకటి. కానీ.. ఇదంతా చెప్పుకోవాడనికే అన్నట్లు ఉంది. ‘పైన పటారం.. లోన లోటారం’ అన్న రీతిలో పాకిస్థాన్ ఆడుతోంది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు ముందు స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ టీమ్ పరువుతీస్తోంది.
బాబర్ అజమ్-రిజ్వాన్ ఓపెనింగ్ జోడీ, ఇఫ్తికర్, ఖుష్దిల్తో బలమైన మిడిల్డార్.. షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ లాంటి హిట్టర్లు, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లాంటి నిప్పులు చెరిగే బౌలర్లు ఉండి కూడా స్వదేశంలో పుట్టినప్పుటి నుంచి ఆడుతున్న పిచ్‌ల పైనే మట్టికరుస్తోంది. 7 టీ20ల సిరీస్‌లో 3-3తో పాక్, ఇంగ్లండ్ సమంగా ఉన్నా.. ఇంగ్లండ్‌కే ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఎందుకంటే.. పాక్ పిచ్‌లపై ఇంగ్లండ్ లాంటి విదేశీ టీమ్‌లు పాక్‌ను ఎదుర్కొవడం అంత సులువైన పనికాదు.. పైగా ఇంగ్లండ్ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడుతోంది. కొంతమంది పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడినా.. నేషనల్ టీమ్స్ మధ్య పాకిస్థాన్‌లో మ్యాచ్ జరగలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంగ్లండ్ పాక్‌ను చిత్తుచిత్తు చేస్తోంది. శుక్రవారం జరిగిన 6వ టీ20లో అయితే మరీ దారుణంగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.3 ఓవర్లలోనే ఊదేసింది. పాక్ బౌలర్లును పాకిస్థాన్‌లోనే ఈ రేంజ్లో కొట్టిన ఇంగ్లండ్ ఇక ఆస్ట్రేలియాలో ఎలా కొడుతుందో చెప్పలేం. బ్యాటింగ్‌లోనూ.. ఆడితే రిజ్వాన్ లేదంటే బాబర్ అజమ్లా తయారైంది పాక్ పరిస్థితి. పేరుకే బలమైన మిడిల్డార్, ఫినిషర్లు ఉన్నారు. శుక్రవారం మ్యాచ్‌లో కూడా బాబర్ అజమ్ ఒక్కడే 87 పరుగులు చేస్తే.. జట్టు మొత్తం కలిపి మిగతా సగం పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్, రౌఫ్ లాంటి ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చినా.. అంతకంటే ముందు మ్యాచ్‌ల్లో వారున్నా పెద్ద ఫరక్ ఏం పడలేదు.
ఇలా పాకిస్థాన్‌ను వారి దేశంలో ఇంగ్లండ్ ఒక ఆట ఆడుకుంటోంది. 7 టీ20ల సిరీస్‌లో ఇక మిగిలిన ఆ ఒక్క మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచిందా పాకిస్థాన్ పరువు మంటగలిసినట్టే. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఈ సిరీస్ కనుక పాక్ ఓడితే.. ఆ ఓటమి తాలుకు ప్రభావం కచ్చితంగా వరల్డ్ కప్‌లో ఆ జట్టు ప్రదర్శనపై ప్రభావం చూసే అవకాశం ఉంది. పేపర్‌పై పులిలా కనిపించే పాకిస్థాన్ టీమ్ సొంత దేశంలో సొంత పిచ్‌లపై ఇలా ఇంగ్లండ్ చేతిలో చిత్తవుతుండటం పాక్ అభిమానుల చేతే ఛీ అనిపించుకుంటోంది. పాకిస్థాన్ టీమ్ పైకి పులి.. లోపల పిల్లి! వీళ్లా ఆస్ట్రేలియా వెళ్లి వరల్డ్ కప్ గెలిచేది అంటూ సోషల్ మీడియా వేదికగా పొట్టుపొట్టు తిడుతున్నారు.
Pak vs Eng 6th T20 | Salt’s 88 helps England to 8-wicket win https://t.co/TFs6tGN4z0
— Icc Cricket Guru (@365_cricket) October 1, 2022
ఇది కూడా చదవండి: కోహ్లీ రికార్డును బాబర్ అజమ్ సమం చేశాడా? మ్యాచ్‌ల పరంగా ఓకే! కానీ..