ఒక భారత సీనియర్ క్రికెటర్ భార్యకు క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భర్తను తలచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్టు రాసుకొచ్చారు.
భారత సీనియర్ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య క్యాన్సర్ బారిన పడ్డారు. సిద్ధూ వైఫ్ నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధూకు స్టేజ్-2 ఇన్వేసివ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా నవ్‌జ్యోత్ కౌర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. త్వరలో తనకు సర్జరీ జరగనున్నట్లు ఆమె వెల్లడించారు. కాగా, సిద్ధూ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి విదితమే. 1988లో జరిగిన రోడ్ రోజ్ కేసులో ఆయన జైలులో ఉన్నారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న భర్తకు నవ్‌జ్యోత్ కౌర్ ట్విట్టర్ వేదికగా భావోద్వేగ లేఖ రాశారు. తన భర్త చేయని నేరానికి జైలులో ఉన్నారన్న నవ్‌జ్యోత్ కౌర్.. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. సిద్ధూ కంటే తానే ఎంతో బాధపడుతున్నానని ట్వీట్లో ఆమె రాసుకొచ్చారు.
‘మీ కోసం ఎంతో ఎదురుచూశా. మీకు న్యాయం జరగట్లేదు. నిజం చాలా శక్తిమంతమైంది. కానీ, ఆ నిజం మీకు పదే పదే పరీక్షలు పెడుతోంది. నన్ను క్షమించండి.. నేను మీ కోసం ఇంకా వేచి ఉండలేను. ఎందుకంటే, ఇది స్టేజ్-2 ఇన్వేసివ్ క్యాన్సర్. ఈ రోజే నేను సర్జరీకి వెళ్తున్నా. దీనికి ఎవరినీ నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇదంతా ఆ దేవుడి ప్లాన్’ అని నవ్‌జ్యోత్ కౌర్ భావోద్వేగ పోస్టు చేశారు. కాగా, 34 ఏళ్ల కింద జరిగిన ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్ష వేసింది. సిద్ధూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో సిద్ధూను పాటియాలాలోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు ఆయన అక్కడే శిక్షను అనుభవిస్తున్నారు.
He is in the prison for a crime he has not committed.Forgive all those involved.Waiting for you each day outside probably suffering more than you. As usual trying to take your pain away,asked for sharing it. Happened to see a small growth, knew it was bad.1/2
— DR NAVJOT SIDHU (@DrDrnavjotsidhu) March 22, 2023
Navjot Singh Sidhu’s wife took to Twitter to reveal that she was diagnosed with stage 2 invasive cancer.#NavjotSidhu #NavjotKaur https://t.co/w5ug0BBIBg
— IndiaToday (@IndiaToday) March 23, 2023