మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ గురించి తెలియని వారు ఉండరు. ఆయన క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేసినా.. బౌలింగ్ చేసినా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టేవి. 1999లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత రాజకీయాల్లో కి వెళ్లారు. కేవలం రాజకీయాల్లోనే కాదు.. వెండితెర, బుల్లితెరపై కూడా తన సత్తా చాటారు.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.
ఒక భారత సీనియర్ క్రికెటర్ భార్యకు క్యాన్సర్ సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భర్తను తలచుకుంటూ ఓ ఎమోషనల్ పోస్టు రాసుకొచ్చారు.
Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించింది. 1988లో చోటుచేసుకున్న ఓ వివాదానికి సంబంధించిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సిద్ధూకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నట్లు సిద్ధూ పేర్కొన్నాడు. ట్విటర్ వేదికగా గురువారం ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. కాగా, 1988 డిసెంబర్ 27న సిద్ధూ, అతడి […]
మన దేశంలో రాజకీయాల్లో, సినిమాల్లో రాణించాలంటే.. బలమైన బ్యాగ్రౌండ్ ఉండాలనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అంతేకాక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారితో పోలిస్తే సామాన్యులు రాజకీయాల్లో రాణించడం అంత సులభం ఏం కాదు. ఇది అందరికి తెలిసిన సంగతే. మహా అయితే ఎమ్మెల్యేగానే, ఎంపీగానో గెలవవచ్చు. కానీ ఏకంగా ఓ పార్టీ స్థాపించి.. దాన్ని అధికారంలోకి తీసుకువచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే పగటికలగానే భావిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టారు అరవింద్ కేజ్రీవాల్. […]
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కొత్త వివాదంలో ఇరుకున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలను పొడిగే క్రమంలో పోలీసులపై నోరుజారి కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు తలుచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోతాయంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. పరువు నష్టం దావా వేశారు. సుల్తాన్ పూర్ లోధీలో సభలో సిద్ధూ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను ప్రసంశించే క్రమంలో ‘ఎమ్మెల్యే తన అధికారంతో పోలీసుల ప్యాంట్లు […]
ఇండియన్ క్రికెట్‌లో స్పిన్నర్‌గా తనదైన ముద్రవేసిన హర్బజన్ సింగ్ ఇటివల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన మ్యాజిక్ బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలను అందించాడు.. అలాగే టీమిండియా సాధించిన అనేక గొప్ప విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, కోల్‌కత్తా జట్లకు ఆడాడు. సుదీర్ఘ కెరీర్ తర్వాత అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఇక తన రెండో ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టాడు భజ్జీ. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పకముందే హర్భజన్ సింగ్ రాజకీయాల్లోకి […]
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పంజాబ్ శాఖలో నెలకొన్న రాజకీయ గందరగోళం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే తాను ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి అండగా ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు […]
గత కొంత కాలంగా పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సీఎం పదవికి ఇటీవల రాజీనామా చేయగా, తాజాగా పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్ విషయంలో రాజీపడబోనంటూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ […]
పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ హై కామాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పంజాబ్ లో పీసీసీని నియమించింది. ఇక పంజాబ్ పీసీసీగా నవజ్యోత్ సింగ్ సిద్ధ్ ను నియామకం చేస్తూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాజకీయాల్లో రోజురోజుకి అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దీన్నీసద్దుమణిగించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం సునీల్ జఖర్ పంజాబ్ పీసీసీగా కొనసాగుతున్నాడు. దీంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని అధ్యక్షుడిని నియామకం చేస్తూ […]