పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ కొత్త వివాదంలో ఇరుకున్నారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలను పొడిగే క్రమంలో పోలీసులపై నోరుజారి కామెంట్ చేశారు. ఎమ్మెల్యేలు తలుచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోతాయంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా.. పరువు నష్టం దావా వేశారు.
సుల్తాన్ పూర్ లోధీలో సభలో సిద్ధూ ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను ప్రసంశించే క్రమంలో ‘ఎమ్మెల్యే తన అధికారంతో పోలీసుల ప్యాంట్లు తడిచేలా చేయగలడు’ అంటూ కామెంట్ చేశాడు. అక్కడితో ఆగకుండా బటాలా సభలోనూ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదొక్కటే కాదు జర్నలిస్టులు ఆ వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. సిద్ధూ వాటిని సమర్ధించుకున్నారు. ఆ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Without Police Escort even a Ricksa Puller will Not Listen to Navjot Singh Sidhu; If you have Problem with your state’s Police, Leave the huge security you carry along: DSP Chandigarh Police pic.twitter.com/cLvtcMo1HN
— MeghUpdates🚨™ (@MeghBulletin) December 25, 2021
‘నవజోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఒక సీనియర్ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మా పోలీసులే కదా సిద్ధూ, అతని కుటుంబానికి రక్షణగా ఉంటోంది. మా సెక్యూరిటీ లేకపోతే ఆయనను రిక్షా లాగేవాడు కూడా పట్టించుకోడు’ అంటూ చండీగఢ్ డీఎస్పీ వ్యాఖ్యానించారు. పరువునష్టం నోటీసులు పంపినట్లు తెలియజేశారు. మరోవైపు సిద్ధూ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. నవజోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Now another Punjab Police officer Warns Punjab Congress Chief Navjot Singh Sidhu to Mind his own Business and Don’t Dare insult the force; Says Forget about anyone, If you can intimate me with your power & position, will drink water from your shoes pic.twitter.com/lWHXT4Jwhh
— MeghUpdates🚨™ (@MeghBulletin) December 27, 2021