క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులుంటాయి. కొన్ని చిరస్మరణీయమైనవైతే మరి కొన్ని చెత్త రికార్డులు. కొన్ని రికార్డులు ఏళ్లు గడుస్తున్నా అలానే ఉంటాయి. ఎవరూ బ్రేక్ చేయడానికి సాహసించరు కూడా. అలాంటి అత్యంత దయనీయమైన రికార్డు గురించి తెలుసుకుందాం.
క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ప్రాచీన క్రికెట్ నుంచి అధునాతన క్రికెట్ వరకూ ఎన్నో రికార్డులు. కొన్ని కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కొన్ని బ్రేక్ అవుతుంటాయి. ఇంకొన్ని చిరస్మరణీయంగా అలానే చెక్కుచెదరకుండా ఉంటుంటాయి. వీటిలో కొన్ని గ్రేట్ రికార్డులయితే మరి కొన్ని అత్యంత చెత్త రికార్డులు. అలాంటి ఓ చెత్త రికార్డు గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ రికార్డు ఒకటి కాదు రెండు కాదు..పది ఇరవై కాదు..యాభై వందేళ్లు కాదు..ఏకంగా 2 శతాబ్దాలకు పైగా అలానే ఉంది. ఆ రికార్డు గురించి తెలుసుకుందాం.
క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డుకు 215 సంవత్సరాలు
అది 1810 సంవత్సరం. ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ వర్సెస్ ది బీఎస్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్. ఇంగ్లండ్ జట్టుపై ది బీఎస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 137 పరుగులు చేసింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ వచ్చేటప్పటికీ పేకముక్కల్లా కూలిపోయింది. మొత్తం ఆరు పరుగులకు జట్టు అంతా ఆలవుట్ అయింది. అందులో ఏడు మంది ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. ఒకే ఒక్కడు అత్యధికంగా 4 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ జట్టులో ఒకే బౌలర్ 5 వికెట్లు పడగొట్టాడు.
ఇంతటి చెత్త రికార్డు ఆ తరువాత ఎప్పుడూ నమోదు కాలేదు. అందుకే ఏళ్లు గడిచి రెండు శతాబ్దాలు దాటినా అలానే పదిలంగా ఉంది. సమీప భవిష్యత్తులో కూడా ఎవరూ బ్రేక్ చేయలేరనుకుంటా.