ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. చర్చీలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబై.. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుతో వెలిగిపోతున్నాయి. క్రిస్మస్ ట్రీలు చూపరులను ఆకట్టుకుంటుంటే, క్రిస్మస్ స్పెషల్ కేకులు నోరూరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా జీసస్ భక్తులు పెద్ద ఎత్తున ప్రార్థనల్లో పాల్గొన్నారు. దేవుని స్తుతిస్తూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఇదిలావుంటే.. భారత క్రికెటర్లు క్రిస్మస్ సంబరాలు మునిగిపోయారు. అందమైన క్షణాలను ఫొటోలు, వీడియోల్లో బంధించి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి క్రిస్మస్ పండుగను జరుపుకోగా, ప్రస్తుత సారధి రోహిత్ శర్మ తన కూతురు కోసం శాంతాక్లాజ్ అవతారమెత్తాడు. సమైరాను క్రిస్మస్ కానుకలతో ముంచెత్తాడు. ఇక మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ఇక వెటరన్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తన భార్య ఆషితా సూద్ తో కలిసి సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎవరెవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారన్నది ఇప్పుడు చూద్దాం..