SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » India Lost The 2019 Odi World Cup

ఆ రన్ అవుట్ కు 4 ఏళ్ళు! విలన్ కావాల్సిన ధోనీని హీరో చేశారు!

కోటి ఆశలతో 2019 వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.. అనూహ్య పరిణామాల మద్య భారత్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 10 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ రన్ అవుట్ కు 4 ఏళ్ళు! విలన్ కావాల్సిన ధోనీని హీరో చేశారు!

సరిగ్గా నాలుగేండ్ల క్రితం.. ఇదే రోజు భారత అభిమానుల గుండె పగిలింది. కోటి ఆశలతో వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. దేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించిన మహేంద్రసింగ్‌ ధోనీ ఆ మ్యాచ్‌ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడమే టీమ్‌ఇండియా పరాజయానికి ప్రధాన కారణంగా పరిణమించింది.

విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో భారీ అంచనాల మధ్య 2019 వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత క్రికెట్‌ జట్టు.. లీగ్‌ దశలో దుమ్మురేపింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడింట నెగ్గి టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. ఇంకేముంది మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్రపంచకప్‌ సొంతమైనట్లే అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో భారత జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌తో సెమీస్‌లో తలపడ్డ భారత్‌కు ఆ మ్యాచ్‌లో ముగ్గురు విలన్లు ఎదురయ్యారు. మొదట వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌ డే కు వాయిదా పడగా.. ఆనక టాప్‌-3 ప్లేయర్లు తలా ఒక పరుగు చేసి పెవిలియన్‌ చేరారు. ఇంకేముందు మ్యాచ్‌ చేజారినట్లే అనుకుంటున్న సమయంలో జడేజా-ధోనీ భాగస్వామ్యం తిరిగి ఆశలు రేపగా.. మరీ నెమ్మదిగా ఆడిన ధోనీ.. భారీ షాట్లు కొట్టాల్సిన సమయంలో రనౌట్‌ రూపంలో వెనుదిరిగి అభిమానులను నిరుత్సాహ పరిచాడు.

జులై 9-10న జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (74), కేన్‌ విలియమ్సన్‌ (67) అర్ధశతకాలతో ఆకట్టుకోవడంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 3 వికెట్లు పడగొట్టాడు. మాంచెస్టర్‌ పిచ్‌ పేస్‌కు సహకరిస్తున్నా.. ఈ స్కోరు చేజ్‌ చేయడం పెద్ద కష్టం కాదనే అంతా భావించారు. అయితే వర్షం కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రపంచ క్రికెట్‌లో మరే ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఒకే వరల్డ్‌కప్‌లో 5 శతకాలు బాది అరుదైన ఘనత సాధించిన రోహిత్‌ శర్మతో మొదలుకొని.. ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా వరకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్నవారు ఉండటంతో టీమ్‌ఇండియా విజయంపై ఎవరికీ సందేహాలు లేకపోయాయి. అయితే మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల్లోనే పరిస్థితి తలకిందులైంది. ఒక్క పరుగు చేసిన హిట్‌మ్యాన్‌ రెండో ఓవర్‌లో పెవిలియన్‌ చేరగా.. ఆ మరుసటి ఓవర్‌లో రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ సింగిల్‌ రన్‌కే డగౌట్‌ బాటపట్టాడు. నాలుగో ఓవర్‌ తొలి బంతికే కేఎల్‌ రాహుల్‌ వీరిని అనుసరించాడు. దీంతో టీమ్‌ఇండియా 5 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రిషబ్‌ పంత్‌ కాస్త సంయమనం పాటించినా.. దినేశ్‌ కార్తీక్‌ (25 బంతుల్లో 6) చెత్త ఆటతో విసిగించాడు. మంచి టచ్‌లో కనిపించిన పంత్‌ (56 బంతుల్లో 32), హార్దిక్‌ పాండ్యా (62 బంతుల్లో 32)లను శాంట్నర్‌ వెనక్కి పంపడంతో టీమ్‌ఇండియా 92/6తో నిలిచింది.

సాధించాల్సిన రన్‌రేట్‌ అంతకంతకూ పెరుగి పోతుండటంతో ఓవైపు ఒత్తిడితో నరాలు చిట్లుతున్నా.. మరో వైపు ధోనీ, జడ్డూ ఉన్నారులే అనే భరోసా కాస్త ఉపశమనాన్నిచ్చింది. అంచనాలకు తగ్గట్లే ఈ జంట ఒక్కో పరుగు జోడిస్తూ.. మ్యాచ్‌ను ముందుకు నడిపించింది. కీలక మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా.. బ్యాట్‌తో తన కెరీర్‌లోనే అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూనే.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో ఒత్తిడిని దూరం చేసే ప్రయత్నం చేశాడు. బౌండ్రీలు సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన జడ్డూ.. 39 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అయితే జడేజా ధాటిగా ఆడుతున్నా.. మరో ఎండ్‌ నుంచి ధోనీ వేగం పెంచలేకపోయాడు.

47 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 203 /6తో నిలిచింది. జడేజా నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో ఫుల్‌ జోష్‌లో ఉంటే.. అప్పటి వరకు 65 బంతులాడిన ధోనీ 38 పరుగలే చేశాడు. అందులో ఒకే ఒక్క ఫోర్‌ ఉండటం గమనార్హం. భారత్‌ విజయానికి 3 ఓవర్లలో 37 పరుగులు కావాల్సి ఉండగా.. గతంలో ఇలాంటి ఎన్నో సందర్భాల్లో జట్టును విజయతీరాలకు చేర్చిన ధోనీ క్రీజులో ఉండటంతో అభిమానులు మనదే విజయం అనే ధీమాతో ఉన్న సమయంలో కివీస్‌ ఏస్‌ పేసర్‌ బౌల్ట్‌ బారత్‌ను దెబ్బ కొట్టాడు. పరుగులు చేయాలనే ఒత్తిడిలో జడేజా.. విలియమ్సన్‌ చేతికి చిక్కాడు. దీంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 31కి చేరగా.. ఫెర్గూసన్‌ వేసిన 49వ ఓవర్‌ తొలి బంతికి ధోనీ సిక్సర్‌ బాదాడు. అదే రేంజ్‌లో మరో రెండు, మూడు షాట్లు ఆడితే పని అయిపోతుందనుకుంటే.. మూడో బంతికి గప్టిల్‌ వేసిన సూపర్‌ త్రోకు ధోనీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వికెట్‌తోనే భారత్‌ విజయంపై ఆశలు వదులుకోగా.. ఆరంభంలో ధోనీ కాస్త వేగంగా ఆడి ఉన్నా.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. చివరకు భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. జడేజా (59 బంతుల్లో 77), ధోనీ (72 బంతుల్లో 50) అర్ధశతకాలు సాధించారు. ఏదేమైనా.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో జట్టును క్లిష్ట స్థితిలో విడిచి పెవిలియన్‌ చేరుతున్న ధోనీ కళ్లలో చెమ్మ ప్రతి భారత క్రీడాభిమానిని కదిలించిందనేది మాత్రం వాస్తవం. దేశానికి ఎన్నో విజయాలు అందించిన ధోని అలా కంటి తడి పెట్టడంతో.. అప్పట్లో అతనిపై ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ.., కాలం చేసే గాయం మానదు కదా? ఇప్పటికీ ఆ మ్యాచ్ లో ధోని స్లో బ్యాటింగ్ ఎవ్వరూ జీర్ణించుకోలేరు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

WHAT A MOMENT OF BRILLIANCE!

Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk

— ICC (@ICC) July 10, 2019

Tags :

  • Cricket. New Zealand
  • MS Dhoni
  • Run Out
  • Team India
  • World Cup 2019
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • Yuvraj Singh: టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

    టీమిండియా బలహీనంగా ఉంది.. వరల్డ్ కప్ గెలిచే సీన్ లేదు: యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్

  • హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

    హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న నెటిజన్స్.. నువ్వు మారవా అంటూ ట్వీట్స్..

  • హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

    హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీతోనే ఓటమి.. ఈ తప్పు గమనించారా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam