బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతామని వెల్లడించింది. వివాదాలతో సహవాసం చేసే షకీబ్ తాజాగా ఒక బెట్టింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయంలో బోర్డు అతనికి నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో షకీబ్ బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తేలితే అతనిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా బోర్డు చైర్మన్ నజ్ముల్ హస్సన్ స్పష్టం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. ‘బెట్ విన్నర్ న్యూస్’ అనే కంపెనీతో స్పాన్సర్‌షిప్ ఒప్పందం చేసుకున్నట్లు షకీబ్ అల్ హసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ పోస్టు చేసిన కొద్దిసేపటికే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. దీంతో హసన్ కొద్ది సేపటికే ఆ పోస్టు డిలీట్ చేశాడు. తర్వాత మళ్లీ పోస్టు చేశాడు. కాగా.. షకీబ్ బెట్టింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకోవడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సిరీస్ అయింది.
బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు బోర్డు చైర్మన్ నజ్ముల్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్‌ను ప్రొత్సహించడం నేరం. క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి వాటిని సహించదు. అందుకే షకీబ్ నిజంగానే బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడా? లేదా? అనే విషయంపై విచారణ జరుపుతామని బోర్డు చైర్మన్ వెల్లడించారు. విచారణలో నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన పేర్కొన్నారు. షకీబ్ డైరెక్ట్‌గా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోకపోయినా.. బెట్టింగ్‌ను ప్రొత్సహించేందుకు అంగీకరించినా నేరమే అని నజ్ముల్ వెల్లడించారు.
కాగా.. కేవలం షకీబ్ సోషల్ మీడియా పోస్టు ఆధారంగా అతనిపై చర్చలు తీసుకోలేమని.. అందుకే అతనికి ఒక నోటీస్ జారీ చేశామని, దానికి షకీబ్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని నజ్ముల్ పేర్కొన్నారు. కాగా 2019లో ఒక సారి షకీబ్‌పై ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి నేరం రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Dear fans! Im proud to announce my new official partnership with BETWINNER NEWS!
If you want to be always in trend and find match analysis and sports highlights, then BETWINNER NEWS is for you!
Search for BETWINNER NEWS on the Internet! #betwinnernews pic.twitter.com/62MPonSauZ
— Shakib Al Hasan (@Sah75official) August 2, 2022
The BCB will investigate a recent social media post from Shakib Al Hasan in which he announced his partnership with a company called “Betwinner News” 👇
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2022
What’s up, fans! 👋👋👋
We are happy to present you our latest ambassador, the most famous and the 🏆top cricket player🏆 from Bangladesh 🇧🇩- SHAKIB AL HASAN🎉🎉🎉 pic.twitter.com/zLk66Jr4Tz
— Betwinner News (@BetwinnerNews) August 3, 2022