ఇటీవల కాలంలో విదేశీ వనితల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి నలుగురి పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్ అనే వివాహిత. అదిమొదలు.. వరుసగా ప్రేమికుడు కోసం స్వదేశానికి స్వస్థి చెప్పి భారత్‌కు..
ఇటీవల కాలంలో విదేశీ వనితల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తి కోసం పాకిస్తాన్ నుండి నలుగురి పిల్లలతో సహా భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్ అనే వివాహిత. అదిమొదలు.. వరుసగా ప్రేమికుడు కోసం స్వదేశానికి స్వస్థి చెప్పి భారత్‌కు వచ్చిన మహిళల గురించి విన్నాం. బంగ్లాదేశ్, పోలండ్ నుండి వచ్చిన మహిళలు.. ప్రియుడి కోసం భారత్ వచ్చేయడంపై వరుస కథనాలు వచ్చాయి. అలాగే పాకిస్తాన్ ప్రేమికుడి కోసం అంజూ అనే భారతీయ వివాహిత దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోయింది. ఇప్పుడు మరో మహిళను ఎప్పుడో ఐదేళ్ల క్రితం దేశం కానీ దేశం వచ్చింది. అయితే ఇప్పుడు ఆమెను స్వదేశానికి పంపించనున్నారు అధికారులు.
ఐదేళ్లు దేశంలో ఎలా ఉంది, అన్ని సంవత్సరాలు భారత్‌లో ఎలా ఉంచారనేకదా మీ డౌట్. ఆ అనుమానం తీర్చడానికే ఈ కథనం. అసలు ఆమె అన్ని రోజులు ఇండియాలో ఉండిపోవడం కారణం ఏంటంటే..? బంగ్లాదేశ్‌కు చెందిన అక్తర్ రహీమా అనే 35 ఏళ్ళ మహిళ 2019లో రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా చూసేందుకు వచ్చింది. అయితే ఆ సమయంలో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. అలా రాష్ట్రాలు దాటుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యవేడు శ్రీ సిటీ పారిశ్రామికవాడలోని అప్పయ్యపాలెం గ్రామానికి చేరుకుంది. పాస్ పోర్టు పోవడంతో పాటు మతి స్థిమితం కోల్పోయింది. ఆ మహిళను శ్రీ సిటీ సెక్యూరిటీ చీఫ్ రమేష్ చూసి.. తన వివరాలు అడగ్గా.. ఏమీ చెప్పలేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తొలుత రహీమాను రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సలహా మేరకు విశాఖ పట్నం ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రికి తరలించారు. మూడేళ్ల పాటు వైద్యం అందించడంతో ఆమె కోలుకోవడం ప్రారంభించింది. ఆమె కోలుకోవడంతో వివరాలు తెలుసుకున్న వైద్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, బంగ్లాదేశ్ ఎంబసీ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు. హైకమిషన్ అధికారులతో సంప్రదింపులు జరిపి, రహీమాను బంగ్లాదేశ్ సరిహద్దులోని హరిదాన్పూర్ వద్ద ఆ దేశ అధికారులకు అప్పగించారు. ఐదేళ్ల తర్వాత రహీమా తన స్వదేశానికి చేరుకుంది.