క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబర్చాలంటే ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. కానీ ఒక క్రికెటర్ మాత్రం దేవుడి మీదే భారం వేసి నిప్పులపై నడిచాడు . ఇంతకీ ఎవరా క్రికెటర్..?
సాధారణంగా ఎవరికైనా కష్టాలు ఉంటే నిప్పులపై నడవడం నడుస్తారు. ఇలా నిప్పులపై నడిస్తే దేవుడు తమ బాధలు తీరుస్తాడని..కొందరి నమ్మకం. పాత కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. మరి కొందరైతే దేవుడి మీద భక్తితో ఇలా చేస్తూ కనిపిస్తారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒక క్రికెటర్ మాత్రం తమ దేశం కోసం నిప్పుల మీద నడుస్తూ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. మ్యాచ్ లేని సమయంలో బాగా ఆడటం కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం చూసి ఉంటాం. కానీ బంగ్లాదేశ్ క్రికెటర్ మహమ్మద్ నయిం మాత్రం కావాల్సినంత ప్రతిభ ఉన్నా.. దేవుడి మీద భారం వేసాడు. ఇంతకీ నయీమ్ ఏం చేసాడో ఇప్పుడు చూద్దాం.
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ మహమ్మద్ నయిం పేరుని క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొన్ని నెలలకే జట్టులో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతూ తన స్థానాన్ని పర్మినెంట్ చేసుకున్నాడు. అయితే ఈ స్టార్ ఓపెనర్ మాత్రం రానున్న ఆసియా కప్ లో మంచి ప్రదర్శన కనబర్చేందుకు మానసికంగా మరింత దృఢంగా అయ్యేందుకు నిప్పుల మీద నడిచి అందరి మనసులని గెలుచుకున్నాడు. మైండ్ ట్రైనింగ్‌లో భాగంగా ట్రైనర్ చెప్పినట్లు అతను నిప్పులపై నడిచాడు. ఇలా చేయడం వల్ల ఆటగాళ్లు మానసికంగా దృఢంగా అవ్వడమే కాకుండా ధైర్యాన్ని పెంపొందిచుకుని, భయాన్ని అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారని, ఫైర్ వాకింగ్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయని ట్రైనర్ వెల్లడించారు.
ప్రస్తుతం నయీమ్ నిప్పులపై నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఇలా ఏ క్రికెటర్ చేయకపోవడంతో నయీమ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ నెల 30 న ఆసియా కప్ టోర్నీ ప్రారంభమ అవుతుంది. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ ఒక గ్రూప్ లో ఉండగా.. భారత్, పాకిస్థాన్, నేపాల్ మరో గ్రూప్ లో ఉన్నాయి. ఆగస్టు 31 న బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్ శ్రీలంకతో ఆడబోతుంది. శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. మొత్తానికి నయీమ్ ఇలా నిప్పుల మీద నడవడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.