ఆసియా కప్ కి ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ స్పిన్నర్ చాహల్ కి చోటు దక్కని సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చాహల్ స్పందిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
ఆసియా కప్ లో భాగంగా నిన్న భారత క్రికెట్ జట్టుని ప్రకటించినప్పుడు ఆ లిస్టులో చాహల్ పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎంపిక చేసిన 17 మందిలో ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించిన సెలక్టర్లు చాహల్ ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో మేజర్ టోర్నీలో ఈ లెగ్ స్పిన్నర్ కి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే ఇటీవలే సెలక్టర్ అగార్కర్ దీనిపై వివరణ ఇస్తూ జట్టులో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను తీసుకోవడం కష్టమైందని, బ్యాటింగ్ ఆర్డర్‌లో డెప్త్ పెంచేందుకే చాహల్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందని అన్నారు. ఆడుతుంది ఉపఖండపు పిచ్ ల మీదే అయినప్పటికీ చాహల్ ని ఎందుకు పక్కన పెట్టారని అభిమానులు సైతం మండిపడ్డారు. ఈ విషయంపై తాజా చాహల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో స్పందించాడు.
ఆసియా కప్ కి ప్రకటించిన జట్టులో కుల్దీప్ యాదవ్ మాత్రమే ప్రధాన స్పిన్నర్ గా ఎంపికయ్యాడు. అక్షర్ పటేల్, జడేజా రూపంలో మరో ఇద్దరు స్పిన్నర్లు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగల సామర్ధ్యం ఉండడం చాహల్ కి ప్రతికూలంగా మారింది. అయితే సాధారణంగా ఉపఖండపు పిచ్ ల మీద మ్యాచులు ఆడేటప్పుడు స్పిన్నర్లను ఎక్కువ మందిని సెలక్ట్ చేస్తారు. కానీ ఈ సారి మాత్రం అనూహ్యంగా ఫాస్ట్ బౌలర్లకు అవకాశమిచ్చింది. సిరాజ్, బూమ్రా, షమీ, శార్దూలు ఠాకూర్, ప్రసిద్ కృష్ణ లను రూపంలో టీమిండియా స్క్వాడ్ లో 5 గురు పేస్ బౌలర్లు ఉన్నారు. పైగా ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్య కూడా ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు. అంతేకాదు చాహల్ ని కాకుండా గాయంతో ఇటీవలే ఐర్లాండ్ తో టీ 20ల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రసిద్ కృష్ణకి ఛాన్స్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సెలక్టర్ల ప్లాన్ ఏంటో తెలియదుగాని చాహల్ ని ఎంపిక చేయకుండా విమర్శలను మూట కట్టుకుంది. సెలక్ట్ కాకపోయినా ఎప్పుడూ చాలా స్పోర్టీవ్ గా ఉండే చాహల్.. ఈ సారి మాత్రం సీరియస్ అయినట్టు కనిపిస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కారు మబ్బుల వెనుక ఉన్న సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అనే అర్థం వచ్చేలా ఎమోజీ పెట్టాడు. చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా సెలెక్టర్లకు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చాహల్ గట్టి కౌంటర్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి వరల్డ్ కప్ లోనైనా చాహల్ కి సెలక్టర్లు అవకాశమిస్తారేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.
⛅️——> 🌞
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023