మరి కొద్దిరోజుల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. 15 మందితో కూడిన టీమ్ ఇండియా జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరికి స్థానం లభించింది. ఎవరు అవుట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ఫార్మట్‌లో జరిగే ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు అనౌన్స్ అయింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఛీఫ్ సెలెక్టెర్ అజిత్ అగార్కర్ జట్టుని ప్రకటించారు. టీ20 టీమ్ ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. శుభమన్ గిల్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 15 మందితో కూడిన టీమ్ ఇండియా ఆసియా కప్ 2025 కోసం సిద్ధమౌతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 జరగనుంది.
ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా జట్టు
సూర్యకుమార్ యాదవ్ ( కెప్టెన్ ), శుభమన్ గిల్ ( వైస్ కెప్టెన్ ), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ ( వికెట్ కీపర్), జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శామ్సన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్
శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్‌కు మొండి చేయి
అయితే యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు చోటు లభించలేదు. ఈ ఇద్దరూ ఎంపిక కాలేకపోవడంపై ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విచారం వ్యక్తం చేశాడు. జట్టులోకి ఎంపిక కాకపోవడంపై ఈ ఇద్దరి నుంచి సమస్య లేదని, బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండూ చూడాల్సి వచ్చిందంటున్నాడు. సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025లో ఇండియా, పాకిస్తాన్ సహా 8 జట్లు పాల్గొంటున్నాయి. సెప్టెంబర్ 10న తొలి మ్యాచ్ యూఏఈతో ఆడనుండగా సెప్టెంబర్ 14న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.