ఆసియా కప్ 2025 ఇండియా పాకిస్తాన్ షేక్ హ్యాండ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ అంశంపై ఇప్పటికే టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ద్వంద్వ వైఖరిపై విమర్శలు వస్తుండగా తాజాగా భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆసియా కప్ 2025 పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో విజయానంతరం టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ క్రికెటర్లకు షేర్ హ్యండ్ ఇవ్వకుండా వచ్చేయడం సంచలనంగా మారింది. దీనిపై చాలామంది ప్రశంసలు కురిపిస్తుంటే కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాక్ కెప్టెన్, పాకిస్తాన్ మంత్రితో ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. అప్పుడు తప్పన్పించని షేక్ హ్యాండ్ మ్యాచ్ తరువాత తప్పన్పించిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఎందుకని అడుగుతున్నారు.
మ్యాచ్ ఆడినప్పుడు కాని తప్పు షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోతుందా
షేక్ హ్యాండ్ అంశంపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్రంగా స్పందించారు. షేక్ ఇవ్వకుండా నిరాకరించడాన్ని తప్పుబట్టారు. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ అడాలని నిర్ణయించినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తే తప్పెలా అవుతుందని చెప్పాడు. మ్యాచ్ అడినప్పుుడు లేని తప్పు చేయి కలిపితే తప్పయిపోతుందా అని ప్రశ్నించాడు. వాస్తవానికి మనోజ్ తివారీ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ టీమ్ ఇండియా బహిష్కరించాలని ముందు నుంచీ చెబుతున్నాడు. అందుకే తాను ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేస్తున్నానని కూడా ప్రకటించాడు.
పాకిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరించి ఉంటే ఏం చెప్పినా ప్రజలు నమ్మేవారని చెప్పాడు. మ్యాచ్ అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వని సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ కెప్టెన్ ఇతరులతో కలచాలనం చేసిన వీడియో తాను చూశానని గుర్తు చేశాడు. మరి అప్పుడు ఎలా షేక్ హ్యాండ్ ఇచ్చారు, అప్పుడు తప్పన్పించలేదా అని సూర్య కుమార్ యాదవ్‌ను నిలదీశాడు. ఈ వీడియోపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడం కోసం నో షేక్ హ్యాండ్ నిర్ణయం తీసుకున్నారా అని అడిగాడు. మ్యాచ్ కంటే ముందు షేక్ హ్యాండ్ ఇచ్చి తరువాత తిరస్కరించడం ద్వారా ఏం సాధించారో అర్దం కావడం లేదన్నాడు.