భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ చూడ్డానికి వాంఖడే స్టేడియానికి వచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. దాంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు.
ఇండియాలో క్రికెట్ కి ఎంత ప్రాధాన్యమిస్తారో.. సినిమాలను కూడా అంతే ఆదరిస్తారు ఆడియెన్స్. కొన్ని సందర్భాల్లో క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లు మైదానాల్లో కలుస్తూ.. అభిమానులని ఖుషీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా సినిమా స్టార్లు ఒక్కోసారి సరదాగా క్రికెట్ చూడడానికి స్టేడియానికి వస్తూ రిలాక్స్ అవుతూ ఉంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ భారత్-ఆసీస్ మ్యాచ్ ను చూడ్డానికి వచ్చి స్టేడియంలో సందడి చేశారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇక రజినీ కాంత్ ను స్టేడియంలో చూసిన అభిమానులు కేరింతలతో తమ అభిమానాన్ని చాటి చెప్పారు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం ముంబై వేదికగా మొదటి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఈ మ్యాచ్ చూడడానికి చాలా ఆసక్తిగా వచ్చారు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడ్డానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ముంబై వాంఖడే స్టేడియానికి వచ్చారు. ముంబై క్రికెట్ అసోసియేషన్.. రజినీకాంత్ ను స్వయంగా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూడాల్సిందిగా ఆహ్వానించారు. ఎంసీఏ రిక్వెస్ట్ ని అంగీకరించిన ఈ లెజెండరీ యాక్టర్.. ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ తో మ్యాచ్ వీక్షిస్తూ కనిపించాడు. వైట్ టీ -షర్ట్, బ్లాక్ ప్యాంటు వేసుకొని ఎంతో హుందాగా సూపర్ స్టార్ ఈ మ్యాచ్ ని చూడడం.. ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. ఒక వైపు వన్డే మ్యాచ్, మరో వైపు సూపర్ స్టార్.. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంగా వీరిద్దరి ఫోటోను ముంబై క్రికెట్ అసోసియేషన్ ట్విట్టర్లో షేర్ చేసింది. 2011 లో ఇండియా- శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ కూడా వాంఖడే స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను చూడ్డానికి కూడా రజినీకాంత్ రావడం, ఇండియా గెలవడం జరిగిపోయాయి. ఈ సారి కూడా సూపర్ స్టార్ రాకతో ఇండియా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వస్తే.. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఈ మ్యాచ్ నువ్వా నేనా అనేట్లుగా సాగుతుంది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకి 188 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ జట్టులో మిచెల్ మార్ష్(81) మినహా ఎవరు ఆకట్టుకోలేకపోయారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 11 ఓవర్లలో 43/4 తో నిలిచి పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసి భారత్ ని చావు దెబ్బ తీసాడు. దాంతో కెప్టెన్ పాండ్య(25) తో కలిసి రాహుల్ (26*) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే 25 పరుగుల వద్ద పాండ్యాను స్టోయినిస్ అవుట్ చేసి.. భారత్ ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది భారత్. క్రీజ్ లో కేఎల్ రాహుల్(26), జడేజా(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ గెలవాలి అంటే వీరిద్దరు కచ్చితంగా క్రీజ్ లో నిలదొక్కుకోవాలి. మరి రజినీకాంత్ భారత్- ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ చూడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Superstar Rajinikanth watching the first ODI in Mumbai. pic.twitter.com/rqLVEYV67V
— Johns. (@CricCrazyJohns) March 17, 2023