జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ దానికింకా సమయం ఉందని చెప్పినా.. ఒకవేళ ఎన్టీఆర్ వస్తే వ్యతిరేకించేవాళ్ళు ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కోసం ఎన్టీఆర్ ని తొక్కేస్తారన్న కామెంట్స్ వస్తున్న క్రమంలో లోకేష్.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. నందమూరి అభిమానులు, టీడీపీ పార్టీ నందమూరి అభిమానులు సైతం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ని తొందరపెట్టారు కూడా. అయితే ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందని అంటున్నారు. ప్రస్తుతానికైతే సినిమాల మీదనే దృష్టి పెడతానని చెప్పేశారు. అయితే ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంటుందని ఇటీవలే తారకరత్న వెల్లడించారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ ఆహ్వానిస్తుందా అన్న ప్రశ్నకు నారా లోకేష్ బదులిచ్చారు.
టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. నందమూరి వర్సెస్ నారా. ఈ క్రమంలో ఎన్టీఆర్ ని పార్టీలోకి రావాలని కోరుకునే వర్గం ఒకవైపు.. నారా వారి చేతుల్లోనే పార్టీ ఉండాలని కోరుకునే వర్గం మరొకవైపు. ఎన్టీఆర్ వస్తే ఆ ఛరిష్మాకి పార్టీ ఎక్కడ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లిపోతుందా అని ఒక బెంగ ఉంటుందన్న ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం కొందరికి ఇష్టం ఉంటే కొందరికి మాత్రం ఇష్టం లేనట్టుగానే ఉంటున్నారన్న ప్రచారం అయితే జరుగుతుంది. నారా లోకేష్ భవిష్యత్తు కోసం ఆలోచించే చంద్రబాబు ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి రానివ్వరన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేష్ స్పందించారు.
తిరుపతి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ యువకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడిగారు. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్ళాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి’ అంటూ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పిన లోకేష్ పై మీ అభిప్రాయమేమిటి? రాజకీయాల్లోకి వస్తే తారక్ కి తగిన హోదా దొరుకుతుందా? లేదా? సీఎంగా తారక్ కి అవకాశం ఉంటుందా? లేదా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా ?
నూటికి కి నూరు శాతం.. రాష్ట్రం బాగు కోరుకునే అందరూ రాజకీయాల్లో కి రావాలి 💯
Nara Lokesh ✨
Jr NTR 💛#TirupatiSaysHelloLokesh #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #HOPEVIJAYAWADACENTRAL pic.twitter.com/NPP3NU0Aab— Rajurabilli (@Rajurabilli2) February 24, 2023