ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. మోదీ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని తెలిపారు. లిక్కర్ స్కాం విషయంలో కవితకు ఈడీ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బుధవారం కవిత ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గౌతం అదానీ మోదీ బినామీ అనే విషయం ప్రతి ఒక్కరి తెలుసని ఆయన తెలిపారు.
ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..” అవినీతి పాలనకు కేంద్రం తీరు పర్యాయ పదంగా మారింది. రూ.3 వేల కోట్ల హెరాయిన్ అదానీపోర్ట్ లో దొరికితే చర్యలు లేవు. అలానే ముంద్రా పోర్టులో 21 వేల కోట్ల హెరాయిన్ దొరికింది. అయినా అదానీపై ఎలాంటి చర్యలేవు. అదానీకి ఆరు పోర్టులను ఇవ్వడంపై నీతి ఆయోగే తప్పుపట్టింది. గౌతం ఆదానీ ఎవరికి బినామీ అని దేశమంతా అడుగుతోంది. ఒక ఇంజిన్ ప్రధాని, మరో ఇంజిన్ అదానీ, ఇదే డబుల్ ఇంజిన్ మోదానీ. మోదీ దేశాన్ని బ్రస్టు పట్టిస్తున్నారు. ఏదో జరుగుతుందంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మోదీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు.
బీజేపీ వాళ్లపై పెట్టిన ఒక్కకేసైనా చూపించండి. దేశ సంపద రూ.13 లక్షల కోట్ల డబ్బులు ఆవిరైనా మోదీ, నిర్మలా సీతారామన్ ఉలకరు పలకరు. అలానే ఎల్ఐసీ డబ్బులు ఆవిరైతే ప్రధాని ఏమాత్రం స్పందించరు. అదానీ మోదీ బినామీ అని చిన్నపిల్లాడు కూడా చెబుతున్నాడు. మోదీ చేతిలో ఈడీ కీలు బొమ్మగా, సీబీఐ తోలుబొమ్మగా మారాయి. బీజేపీనే ఈడీ, ఐటీ దాడులు చేయిస్తుంది. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను బీఆర్ఎస్ పై ఉసిగొల్పుతుంది. కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు, మోడీ సమన్లు” అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి.. ప్రధాని మోదీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.