SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Chandrababu Naidu Announced Tdp Manifesto From Mahanadu 2023

TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..

  • Written By: Dharani
  • Published Date - Mon - 29 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
TDP వరాల జల్లు.. నిరుద్యోగులకు 3000.. మహిళలకు నెలకు రూ.1500!

ఆంధ్రప్రదేశ్‌లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని అధికార పార్టీ.. ఈ సారి కచ్చితంగా గెలిచి తీరాలని విపక్షాలు గట్టిగా తీర్మానించుకోవడమే కాక.. ఆ మేరకు కార్యచరణ, ప్రణాళిక రెడీ చేసుకుని.. రంగంలోకి దిగుతున్నాయి. ఇక ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ.. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్‌ యువగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తుండగా.. చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలతో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికల ముందు వచ్చిన మహానాడు కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పనిలో పనిగా.. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. మహానాడు వేదికగా తొలి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల హమీల్లో భాగంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలు..

ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా విశిష్టమైంది. పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలోనే మహానాడు కూడా రావడంతో.. మరింత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి మహానాడుకి వేదిక అయ్యింది. ఈ కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2024లో తాము అధికారంలోకి వస్తే.. అమలు చేయబోయే 6 ప్రధాన హామీలను మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. బీసీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, యువతను ఆకర్షించేలా ఈ 6 హామీలు ఉన్నాయి. ఆ వివరాలు..

మహిళల కోసం మహాశక్తి..

టీడీపీ అధికారంలోకి వస్తే.. మహా శక్తి పథకం ద్వారా మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఉన్న 18 ఏళ్లు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలానే ‘తల్లికి వందనం’ అనే మరో పథకం ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరి పేరు మీద.. ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక “దీపం” పథకం కింద.. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామంటూ మహిళలపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు

Join Our Whatsapp Channel

బీసీల కోసం ప్రత్యేక చట్టం..

బీసీల రక్షణ కోసం చట్టం తెచ్చి.. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు మహానాడు వేదిక మీదుగా ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన బీసీలను తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు.

ఇంటింటికీ నీరు..

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఇంటింటికీ మంచి నీరు.. పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

యువగళం నిధి..

2024 ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూనే.. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

అన్నదాతకు అండగా..

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతన్నకు అండగా ఉంటామని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. అంతేకాక ప్రతి రైతుకు ఏడాదికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి.. వారికి దన్నుగా ఉంటామని స్పష్టం చేశారు.

పూర్ టు రిచ్..

పేదలను సంపన్నులను చేయడానికి తెలుగుదేశం కృషి చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు ప్రకటించిన ఈ మినీ మేనిఫస్టో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ఈ హామీలు ప్రకటించారనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు ప్రకటించిన ఈ హామీలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి చంద్రబాబు హామీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Andhra Pradesh
  • Chandrababu Naidu
  • Mahanadu
  • Manifesto
  • Rajahmundry
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిత్తూరు జిల్లాలో దారుణం.. వెలుగులోకి కీచక టీచర్ లీలలు

చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • ఏపీలో మళ్ళీ ఎన్నికల నగారా.. 23 స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

    ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • పెరిగిన నిత్యావసరాల ధరలు.. ప్రభుత్వం గుడ్ న్యూస్

    రేషన్ షాపుల్లో భారీ డిస్కౌంట్.. రూ.100కే కందిపప్పు.. రూ.125కే పామాయిల్..!

  • సచివాలయంలో కేబినెట్ సమావేశం..

    ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ఏకంగా ₹31,387 కోట్ల AI డేటా సెంటర్‌కు ఆమోదం!

  • 2024 కంటే మెరుగైన ఫలితాలు సాధించాం..వైసీపీకి  ఓట్లు శాతం 6.25 తగ్గిందన్నచంద్రబాబు

    ఏపీ స్థానిక ఎన్నికల్లో కూటమి ఓట్ల శాతం పెరిగింది.. వైసీపీకి 6.25 శాతం తగ్గిందన్న చంద్రబాబు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

  • OG-2, OG-3 కన్ఫర్మ్? పవన్ కళ్యాణ్ సినిమాపై తమన్ బిగ్ అప్‌డేట్.. 2027లో షూటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam