తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ గా ఉన్న ఆలీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 2019 ఎన్నికల సమయం నుంచి ఆలీ పార్టీలో కీలక నేతగా పని చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి కమెడియన్ ఆలీకి ఏదో ఒక పదవి అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కాగా ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వం కమెడియన్ ఆలీకి శుభవార్త చెప్పింది. ఆలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న ఆలీ పార్టీని వీడితున్నారనే గతంలో వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆలీ వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కూడా రాకపోలేదు. ఇలాంటి వార్తలు రావడంతో అందరూ నిజమే అనుకున్నారు. కాగా ఇటీవల ఈ వార్తలపై స్పందించి ఆలీ క్లారిటీ ఇచ్చారు. నేను పార్టీ నుంచి తప్పుకోవడం లేదని, అవ్వన్ని తప్పుడు ప్రచారాలనే వాటిని కొట్టిపారేశారు. ఇక నాకు పదవుల మీద ఆశలేదని, ఎప్పుడూ జగన్ మనసులో స్థానం ఉంటే చాలని ఆలీ చెప్పుకొచ్చారు.
ఇలా చెప్పిన కొన్నిరోజులకే సీఎం జగన్ ఆలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆలీ ఆనందం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న ఆలీకి కీలక పదవి అప్పగించడంతో పార్టీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక దీనిపై ఆలీ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి మరి.