భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఎంతో క్రేజ్ ఉంది. వాటిలో మరీ ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కి ఎక్కువ యూజర్స్ ఉంటారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో నెట్ ఫ్లిక్స్ కు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ సంస్థ పలు దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అందరూ ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. వాటిలో ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ కు సెపరేట్ యూజర్ బేస్ ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ లు, షోలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప క్రేజ్ ఉంటుంది. అయితే పెరుగుతున్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్లు తగ్గారనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఖరీదుగా ఉండటం. అయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ధరలు తగ్గించే పనిలో పడింది.
నెట్ ఫ్లిక్స్ కు గత రెండేళ్ల కాలంలో ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఆ సంస్థ నెలవారీ చందా విషయంలో ఎప్పటినుంచో ఉన్న యూజర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ రెండు నెలల సబ్ స్క్రిప్షన్ తో మిలిగిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏడాది సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకునే వీలుంది. నెట్ ఫ్లిక్స్ లో ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా.. మరీ అంత ఖర్చు పెట్టి ఎలా చూడాలి అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇటీవల తీసుకొచ్చిన నో పాస్ వర్డ్ షేరింగ్ నిబంధన కూడా ఆ సంస్థకు తిప్పలు తెచ్చిపెట్టింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ నెలవారీ చందా తగ్గించింది.
చందా తగ్గించడం వల్ల కచ్చితంగా యూజర్లు పెరుగుతారంటూ ఆ సంస్థ భావిస్తోంది. అందుకే ఏకంగా 30 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ తమ నెలవారీ చందాను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 30 దేశాల్లో ధరలు తగ్గించడం అంటే చాలా పెద్ద నిర్ణయంగా భావిస్తున్నారు. ఆ దేశాలు ఏంటంటే.. వియత్నాం, థాయ్ లాండ్, క్రొయేషియా, ఈజిప్ట్, యెమెన్, జోర్డాన్, లిబ్యా, క్రొయేషియా, ఇరాన్, కెన్యా, ఇండోనేషియా, వెనుజులా, ఫిలిప్పిన్స్, ఈక్వడార్, బల్గేరియా, నిక్రాగువా, మలేషియా వంటి పలు దేశాల్లో నెట్ ఫ్లిక్స్ తమ నెలవారీ చందాని తగ్గించింది. అయితే ఈ లిస్టులో ఇండియా లేదు. కాకపోతే త్వరలోనే ఇండియాలో కూడా నెట్ ఫ్లిక్స్ నెలవారీ చందా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. నెట్ ఫ్లిక్స్ నెలవారీ చందా తగ్గింపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.