హైదరాబాద్- వివాహేతర సంబంధాలు చివరికి విషాదాన్నే మిగులుస్తున్నాయి. అయినా సమాజంలో కొందరు ఇప్పటికీ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలు చాలా వరకు ప్రాణాల మీదకు తెస్తున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు. రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పూడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తున్న వివాహిత, యువకుడి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే రెండు రోజుల క్రితం ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మహిళ, ఆమె ప్రియుడు వికారాబాద్ జిల్లా పూడూరు దగ్గర అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగినట్లు ప్రియుడి తమ్ముడికి తెలియడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడగా, ఆ యులకుడు చవిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ ఇద్దరి మధ్య సంబంధాన్ని గమనించిన బోరబండకి చెందిన ఇస్మాయిల్, యాసిన్ అనే ఇద్దరు యువకులు వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య సంబంధం గురించి బయట అందరికీ చెబుతామంటూ మహిళపై నీచానికి పాల్పడినట్లు సమాచారం. ఇద్దరు యువకులు ఆమెను బెదిరించి అత్యాచారం చేసినట్లు విచారణలో బాధితురాలు వెల్లడించడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.
ఆ ఇద్దరు యువకుల శాడిజాన్ని భరించలేక ప్రియుడితో కలసి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ విషయం ప్రియుడి సోదరుడికి తెలిసి ఆస్పత్రికి తరలించడంతో ఆమె కోలుకుంది. యువకుడి పరిస్థితి విషమించడంతో ప్రాణాలు వదిలాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇద్దరు యువకులు పరారీరో ఉండగా, పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.