హైదరాబాద్- వివాహేతర సంబంధాలు చివరికి విషాదాన్నే మిగులుస్తున్నాయి. అయినా సమాజంలో కొందరు ఇప్పటికీ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలు చాలా వరకు ప్రాణాల మీదకు తెస్తున్నా మిగతా వారిలో మార్పు రావడం లేదు. రెండు రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పూడూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వివాహిత మహిళ, ఆమె ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒకే ఆఫీస్‌లో కలిసి పనిచేస్తున్న వివాహిత, యువకుడి మధ్య పరిచయం […]