వస్తువు లేదా పరికరం, వాహనాల వంటివి.. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి రూపురేఖలు మారి ఆధునీకరణ సంతరించుకుంటాయి. మనిషి వినియోగానికి సహకరిస్తాయి. ఇటువంటి కొత్త ఆలోచనలే అందరి మన్ననలు పొందుతాయి. తాజాగా ఓ తెలుగు వ్యక్తి సైకిల్ ను ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు.
ఆశ, అవసరాలు మనిషిని ఆలోచింపజేస్తాయి. కొత్త కొత్త ఆలోచనల వైపు అడుగులు వేసేలా చేస్తాయి. కొంగొత్త ఆవిష్కరణలు పుట్టుకొచ్చేలా పురిగొల్పుతాయి. అవి మనిషి మనుగడకు తోడ్పాటును అందిస్తాయి. వస్తువు లేదా పరికరం, వాహనాల వంటివి.. మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి రూపురేఖలు మారి ఆధునీకరణ సంతరించుకుంటాయి. మనిషి వినియోగానికి సహకరిస్తాయి. ఇటువంటి కొత్త ఆలోచనలే అందరి మన్ననలు పొందుతాయి. అలాంటి ఆవిష్కరణ చేసి వార్తల్లో నిలిచారు ఓ చిరు పచారి సరుకుల వ్యాపారి. సైకిల్‌ను ఓ ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేశాడు. దాని గురించి మనం తెలుసుకుందాం.
తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన చిరు వ్యాపారి పాప చంద్ర.. పెద్ద ప్రయత్నమే చేశాడు. కొత్త బైక్ తీసుకోవాలనుకున్నాడు. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అయినా..వెనకడుగు వేయలేదు. తన వద్ద ఉన్న సైకిల్‌నే బైక్‌గా మార్చేశాడు. ఇంతకు ఆ బైక్‌ను ఎలా రూపొందించాడంటే, ఎందుకు మార్చాల్సి వచ్చిందో.. పూర్తి వివరాల్లోకి వెళితే..సిద్ధి పేట జిల్లా దుబ్బాక మండల్ హబ్సీపూర్ గ్రామవాసి. అతను ఆహార పదార్ధాల ఉత్పత్తుల దుకాణాన్ని నడుపుతున్నాడు. తన వ్యాపార అభివృద్ది పరుచుకునే క్రమంలో వీధి వీధి సైకిల్‌పై తిరుగుతూ సరుకును అమ్ముతున్నాడు. అయితే సైకిల్‌పై తిరుగుతుంటే కష్టమౌతున్ననేపథ్యంలో బైక్ కొనాలని భావించాడు. బైక్ కొనేంత డబ్బు అతని వద్ద లేదని భావించి.. తన సైకిల్‌నే మోటార్ బైక్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా పాప చంద్ర అదే పనిలో పడ్డాడు. తన సైకిల్‌ను ఎలక్ట్రిక్ బైక్ గా తయారు చేయడానికి ఓ బ్యాటరీ, మోటార్‌ను కొనుగోలు చేశాడు. బైక్‌కి హెడ్ లైట్, మ్యూజిక్ సిస్టమ్, స్పీడ్ కంట్రోల్ సిస్టమ్ పరికరాలను అమర్చాడు. దీంతో సైకిల్ ఎలక్ట్రిక్ బైక్‌గా మారిపోయింది. ఈ ఆవిష్కరణపై పాప చంద్ర మాట్లాడుతూ.. సైకిల్‌ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చడానికి దాదాపు రూ.16000 వేలు ఖర్చు అయిందన్నారు. వ్యాపారి పని తీరును గుర్తించిన స్థానికులు అభినందించారు. తన అవసరానికి అనుకూలంగా సైకిల్‌ని ఎలక్ట్రిక్ బైక్ గా మార్చిన చిరు వ్యాపారి ప్రయత్నంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.