బాలీవుడ్ న్యూస్- ప్రముఖ బాలీవుడ్ నటుడు, సింగర్ యోయో హనీ సింగ్ పై ఆయన భార్య శాలినీ తల్వార్ సింగ్ గృహ హింసతో పాటు ఆర్థిక మోసం కింద కేసు పెట్టింది. గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి 10 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పించాలని ఆమె కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఈ నెల 28 లోపు వివరణ ఇవ్వాలని హనీ సింగ్ ను కోర్టు ఆదేశించింది.
అంతే కాదు హనీ సింగ్ భార్య పేరు మీదున్న ఉమ్మడి ఆస్తి జోలికి వెళ్లకూడదని శాలినీ తల్వార్‌కు స్పష్టం చేసింది. ఈ క్రమంలో షాలినీ తల్వార్ కోర్టుకు సమర్పించిన 120 పేజీల లేఖలో ఆమె పలు ఆసక్తిరమైన అంశాలను ప్రస్తావించింది. తమ పెళ్లి 2011లో అయ్యిందని, హనీమూన్ అయ్యాక హర్దేశ్ సింగ్‌లో చాలా మార్పు వచ్చిందని ఆమె చెప్పారు. హనీమూన్ సమయంలోను తనను ఒంటరిగా వదిలేసి తాగుతూ తిరిగేవాడని, గట్టిగా నిలదీస్తే జుట్టు పట్టుకుని కొట్టిన సందర్భాలు ఉన్నాయని షాలినీ లేఖలో పేర్కొంది.
హార్ధేశ్ సింగ్ కు పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకే తనను టూర్లకు తీసుకెళ్లేవాడు కాదని చెప్పుకొచ్చింది. తమ పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాడని, సోషల్ మీడియాలో పెళ్లి ఫొటో లీక్ అవ్వడానికి తానే కారణమని చాలా రకాలుగా హింసించాడని ఆవేధన వ్యక్తం చేసింది.
బ్రౌన్ ర్యాంగ్ పాట కోసం వర్క్ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్‌కు అక్రమ సంబంధం ఉందని చెప్పిన షాలినీ తల్వార్, ఆ ఫొటోలు తాను చూసి నిలదీస్తే, కోపంతో తనపై మందు బాటిళ్లు విసిరాడని లేఖలో పేర్కొంది. అంతే కాదు ఒకరోజు తాను బట్టలు మార్చుకుంటుంటే హనీ సింగ్ తండ్రి తన గదిలోకి వచ్చి అసభ్యంగా తాకాడని చెప్పింది షాలినీ తల్వార్. ఇప్పుడీ అంశం బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.