తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలి.. అనే రోజులు పోయాయి. ఇప్పుడు తింటే గారెలే తినాలి చూస్తే చంద్రయాన్ 3 విజయం చూడాలి అన్న రేంజ్ లో సాగింది నిన్నటి ముచ్చట.
తింటే గారెలే తినాలి.. వింటే మహాభారతమే వినాలి.. అనే రోజులు పోయాయి. ఇప్పుడు తింటే గారెలే తినాలి చూస్తే చంద్రయాన్ 3 విజయం చూడాలి అన్న రేంజ్ లో సాగింది నిన్నటి ముచ్చట. ఇంతకు ముందు ఒక లెక్క.. గిప్పటి సంధి ఒక లెక్క.. భారతీయుడు తలుచుకుంటే సాధించలేందంటు.. ఏది లేదని మరోసారి రుజువు చేసింది చంద్రయాన్ 3 ప్రపంచ వ్యాప్తంగా ఆందరి దృష్టిని ఆకర్షించింది చంద్రయాన్ 3. ఎక్కడ చూసిన చంద్రయాన్ గురించే టాపిక్. భారతీయులందరి గుండెల్లో ఆనందాలు నింపుతూ.. చంద్రయాన్ 3 చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంటే.. కొన్ని కోట్ల మంది ప్రజలు ఆనందంతో తిలకించారు. నేడు గర్వంగా భారతీయ జెండాను చంద్రమండలంపై ఎగురువేశాం అనే ఆనందం వెనుక ఎంతో కృషి ఉంది. ఈ క్రమంలో చంద్రయాన్ ప్రయాణాన్ని ఒక సినిమాగా మన కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేస్తే అది నిజంగా అద్బుతమే అని చెప్పవచ్చు.
చంద్రయాన్ 1 నుంచి చంద్రయాన్ 3 విజయం వరకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఇస్రో శాస్ర్తవేత్తలు ఎలా అధిగామించారో తెలుపుతూ.. ఒక సినిమాగా తీసి భారతీయులకు చూపించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి ఆసక్తికర సినిమాలు తీయాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అని చెప్పవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు నెటిజన్లు కూడా చంద్రయాన్ 3 బమోపిక్ తీయమని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏదైనా సెన్సేషన్ సృష్టించిన ఘటన జరిగితే ఆ అంశంపై సినిమా తీయడం మేకర్స్ కు అలావాటే కదా..
ఇక బాలీవుడ్ లో బమోపిక్ సినిమా తీయాలంటే మొదట వినిపించే పేరు అక్షయ్ కూమార్.. ఇప్పటికే మంగల్, రామసేతు,కేసరి,OMG వంటి విభిన్న చిత్రాలతో మెప్పించాడు. దీంతో చంద్రయాన్-3 సినిమా తీస్తే ఆయన మాత్రమే న్యాయం చేయగలడని ఆయన ఫ్యాన్స్ తెలుపుతున్నారు. ప్రధాని మోదీతో అక్షయ్ కుమార్‌కు మంచి అనుబంధమే ఉంది. అందులో ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే చంద్రయాన్-3 విజయవంతం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ను అక్షయ్ తెరకెక్కిస్తారని పలువురు అంటున్నారు. అలాగే దిన్ని తెలుగు దర్శకులు కూడా తీస్తే బాగుంటుందని, అందులోను రాజమౌళి లాంటి అగ్ర దర్శకులు తీస్తే జనాలు ఆదరిస్తారని మరి కొందరు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ చంద్రయాన్-3 బమోపిక్ ను ఎవరు తీస్తారో.