ఫిల్మ్ డెస్క్- రాంగోపాల్ వర్మ.. సంచలనాలకు మారు పేరు. ఆర్జీవి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బాగా యాక్టీవ్ గా ఉంటారు. ఆయన ఎప్పుడు ఎవరిని పొగుడుతారో, ఎవరిపై విమర్శలు గుప్పిస్తారో ఎవ్వరు ఊహించలేరు. తాజాగా బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్నోగ్రఫి చేస్తున్నారన్న నేరంపై పోలీసులు అరెస్ట్ చేయడంపై రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రధానంగా పోర్నోగ్రఫీపై ఆర్జీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడిన రాంగోపాల్ వర్మ, రాజ్ కుంద్రా అరెస్ట్, పోర్నోగ్రఫీ ఇష్యూపై మాట్లాడారు. తన దృష్టిలో శృంగారమే బంగారం అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. ఇద్దరికీ ఇష్టమైనప్పుడు సెక్స్ చేయడం తప్పు కాదని, ఆ ఇద్దరి అంగీకారంతో వేరొక వ్యక్తి షూట్ చేయడంలోనూ తప్పు లేదనేది తన మార్క్ సమాధానం చెప్పారు వర్మ. పోర్నోగ్రఫీ తప్పుకాదని, అదే బలవంతంగా చేస్తే ఖచ్చితంగా తప్పు అని ఆర్జీవీ తేల్చి చెప్పారు.
ఇక ఎక్స్ఎక్స్ఎక్స్ అంటే ఎంటో కూడా వివరించారు రాంగోపాల్ వర్మ. కొన్నేళ్ల క్రితం సింగిల్ ఎక్స్, ఎక్స్ఎక్స్, ఎక్స్ఎక్స్ ఎక్స్ అనే కేటగిరీస్ ఉండేవని గుర్తు చేసుకున్నారు. సింగిల్ ఎక్స్ అంటే కొంచెం, ఎక్స్ఎక్స్ అంటే కొంచెం ఎక్కువ, అదే ఎక్స్ఎక్స్ఎక్స్ అంటే పూర్తిగా అని అర్థం అంటూ తన వీడియో లైబ్రరీ రోజుల నాటి విషయాలను చెప్పారు.
యూట్యూబ్, సోషల్ మీడియాలో కొన్ని వందల, వేల పోర్న్ రిలేటెడ్ వీడియోలు ఉన్నాయని, అవన్నీ బయటకు తీస్తే చాలామందిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని వర్మ అన్నారు. రాజ్ కుంద్రా శిల్పా శెట్టి భర్త కావడం, ఆయన బిజినెస్ మెన్ అవ్వడంతో ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు ఆర్జీవి.