SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Nhai New Rules Vehicle Insurance Check At Toll Plazas

టోల్ గేట్ల వద్ద కొత్త రూల్.. మీ వెహికల్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే SMS!

  • Written By: Ayyappa Panja
  • Published Date - Wed - 18 November 26
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాహనదారులకు బిగ్ అలర్ట్.. వెహికిల్ ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ నుంచి వెళ్తున్నారా..?

వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఈ వార్తను తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇప్పటివరకు టోల్ గేట్ అనగానే కేవలం ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేదా టోల్ ట్యాక్స్ కట్ అవ్వడం మాత్రమే మనకు తెలుసు. కానీ, ఇక నుంచి మీ వెహికల్‌కు ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది కూడా టోల్ గేట్ దగ్గరే ఇట్టే తెలిసిపోతుంది. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకుండా రోడ్డెక్కే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకు అసలు మ్యాటరేంటి అనేది ఓ సారి చూద్దాం.

కొత్తగా వెహికల్ కొనుగోలు చేసినప్పుడు మొదటి ఏడాది డీలరే ఇన్సూరెన్స్ అందిస్తాడు. అయితే చాలా మంది ఆ గడువు ముగిసిన తర్వాత ఏళ్ల తరబడి రెన్యూవల్ చేసుకోకుండానే వాహనాలను రోడ్లపై నడుపుతుంటారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకే NHAI ఒక కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ గేట్ల వద్ద వెహికల్స్ ఇన్సూరెన్స్ స్టేటస్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించేందుకు ఒక సరికొత్త టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం ఈ అత్యాధునిక ఆటోమేటెడ్ వ్యవస్థను ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్ పై ముండ్కా టోల్ ప్లాజా వద్ద తొలిసారిగా ‘పైలట్ ప్రాజెక్ట్’ కింద విజయవంతంగా ప్రారంభించారు. రాబోయే రోజుల్లో దీన్ని దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ వ్యవస్థ వెనుక ప్రభుత్వానికి చెందిన పటిష్టమైన డేటాబేస్ అనుసంధానం ఉంది. ఇప్పటివరకు ఉన్న వాహనాల సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ డేటా బేస్‌తో లింక్ చేసి ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఏ వాహనమైనా సరే టోల్ గేట్ గుండా వెళ్లగానే, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆటోమేటిగ్గా ‘వాహన్’ డేటా బేస్‌కు చేరుకుంటుంది. ఆ క్షణంలో ఆ వాహనానికి థర్డ్ పార్టీ యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని సిస్టమ్ క్షణాల వ్యవధిలో వెదికి పట్టుకుంటుంది. ఒకవేళ పాలసీ గడువు ముగిసిందని తేలితే, ఆ వెంటనే అసలు ప్రక్రియ మొదలవుతుంది.

Join Our Whatsapp Channel

మీ వాహనానికి ఇన్సూరెన్స్ లేదని తేలితే.. టోల్ గేట్ దాటిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఒక హెచ్చరిక సందేశం వస్తుంది. ఆ ఎస్‌ఎంఎస్‌లో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, టోల్ దాటిన సమయం, ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసిన వివరాలు స్పష్టంగా ఉంటాయి. వెంటనే పాలసీని రెన్యూవల్ చేసుకోవాలని ఆ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేస్తారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఇక్కడ వాహనదారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇన్సూరెన్స్ లేదనే కారణంతో టోల్ గేట్ వద్ద మీ వాహనాన్ని ఎక్కడా ఆపడం జరగదు. అలాగే మీ ఫాస్టాగ్ ఖాతా నుంచి అప్పటికప్పుడే జరిమానా డబ్బులు కట్ అయ్యే విధానం కూడా ప్రస్తుతానికి లేదు. కేవలం వాహనదారుల్లో అవగాహన కల్పించడానికి, సకాలంలో ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకునేలా ప్రోత్సహించడానికి మాత్రమే ఈ రూల్ తీసుకొచ్చారు. కాబట్టి, మీ వాహన ఇన్సూరెన్స్ గడువు తీరిపోతే వెంటనే రెన్యూవల్ చేసుకొని భారీ పెనాల్టీల బారి నుంచి తప్పించుకోండి.

Tags :

  • FASTag
  • Insurance Check
  • latest telugu news
  • NHAI
  • NHAI Rules
  • Road Safety
  • Third Party Insurance
  • Toll Gate Rules
  • Traffic Rules
  • Vahan Database
  • Vehicle Insurance
  • Vehicle Owners
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కన్న కూతురునే కడతేర్చిన కసాయి తల్లి..

కన్నబిడ్డను కోల్పోయిన కుటుంబం.. మహబూబాబాద్‌లో 8 నెలల చిన్నారి మృతి!

  • దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

    దీపావళి వేళ హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదాలు

  • Know The Rules: ట్రాఫిక్ పోలీసులు మీ వాహనం తాళం తీసుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి

    ట్రాఫిక్ పోలీసులు మీ వాహనం తాళం తీసుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి

  • యాక్సిడెంట్స్ పై షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ!

    యాక్సిడెంట్స్ పై షాకింగ్ వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ!

  • ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

    ఏడేళ్ల తరువాత అమ్మ ఒడికి చేరిన బాలిక! ఏం జరిగిందంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఆకాశంలోనే మంటలు.. కుప్పకూలిన మిలిటరీ విమానం.. 19 మంది మృతి!

  • టోల్ గేట్ల వద్ద కొత్త రూల్.. మీ వెహికల్‌కు ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే SMS!

  • రూ.100 కోసం ప్రాణం తీశారా? భద్రాచలం లాడ్జిలో జొమాటో డెలివరీ బాయ్ మృతి!

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam