ప్రేమ పేరుతో యువతీయువకులు మోసం పోవటం, ఆ తర్వాత హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది. చిన్నపాటి క్షిణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుని జీవితాలను ఆగం చేసుకుంటున్నారు నేటి తరం కొందరు ప్రేమికులు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే ఒకటి కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..శివమూర్తి అనే 21 ఏళ్ల యువకుడు అనే యువకుడు హోసనగరె ప్రాంతంలో నివాసమంటున్నాడు. ఇక ఇదే ప్రాంతంలో ఓ నర్సింగ్ కాలేజీలో చదువుతున్న కవిత అనే యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా కలిసి కొన్నాళ్లు మాట్లాడుకున్నారు. అది ఇద్దరి మధ్య రాను రాను ప్రేమగా మారింది. అలా వారి ప్రేమాయణం కాస్త కాలంతో పరుగులు పెడుతూ ఏడేళ్లు గడిసింది. కానీ ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలతో విభేదాలు భగ్గుమన్నాయి.
దీంతో కవితకు ఇష్టం లేక శివమూర్తిని నన్ను కలవద్దని, నాతో మాట్లాడొద్దని తెగేసి చెప్పేసింది. మనోడి గుండె పగిలినంత పనైంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరగటం, కవిత అతనితో మాట్లాడకపోవటం చేస్తుంది. ఇక క్రమంలోనే శివమూర్తి మాత్రం ఓ అంబులెన్స్ డ్రైవర్ తో కవిత సన్నిహితంగా ఉంటుందని పసిగట్టాడు. ఇది తట్టుకోలేక పోయిన శివమూర్తి ఏం చేయాలో తెలియక తికమకలో ఉన్నాడు.
దీంతో ఓ రోజు కవితకు ఫోన్ చేసి నీతో మాట్లాడాలని, కలవాలని ఓ చోటకు రామ్మన్నాడు. దీంతో శివమూర్తి మాట ప్రకారం కవిత రమ్మన్న చోటుకి రానే వచ్చింది. దీంతో ఇక్కడ ఇద్దరి మధ్య కాస్త మాటల యుద్దం పెరిగి గొడవకు దారి తీసింది. ఇక కోపంతో రగిలిపోయిన శివమూర్తి కవితను హత్యచేశాడు. దీంతో అనంతనం ఓ సూసైడ్ నోట్ రాసి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
