ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని అన్నారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. రోశయ్య మరణంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని.. రోశయ్య మనస్ఫూర్తిగా ఆహ్వానించారని తెలిపారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని కొనియాడారు.
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021