తరచూ సంచలన తీర్పులిచ్చే మద్రాస్ హైకోర్టు మరోసారి అలాంటి తీర్పు ఇచ్చింది. మహిళను చేయి పట్టుకుని లాగడం నేరం కాదని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ మహిళను చేయి పట్టుకుని లాగిన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు జారీ చేసింది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు మహిళను చేయి పట్టుకుని లాగితే నేరం అవదని మధురై థర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఘటన 2015లో జరిగింది. పశువులు మేపుకుంటున్న ఓ మానసిక వికలాంగురాలిని చోళవందానైకు చెందిన మురుగేశన్ చేయి పట్టుకుని లాగుతాడు. ఆ వికలాంగురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై ధర్మాసనం చేపట్టింది.
ఈ కేసులో ప్రత్యేక కోర్టు మురుగేశన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించగా అతడు మధురై ధర్మాసనానికి అప్పీల్ చేశాడు. విచారణ అనంతరం జస్టిస్ మంజుల నిందితుడిలో ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. బాధితురాలిని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యంతోనే చేయి లాగాడనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. దిగువ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసింది. ఏ విధమైన దురుద్దేశం లేనప్పుడు మహిళను చేయి పట్టుకుని లాగితే అది నేరం కాదని, కేవలం ఆ మహిళను బాధపెట్టడమేనని స్పష్టం చేసింది.
ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ట్రయల్ కోర్టు మురుగేశన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సదరు నిందితుడు పైకోర్టుకు అప్పీల్ చేసుకోవడంతో జస్టిస్ మంజుల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ నిందితుడు మహిళను దురుద్దేశంతో చేయి పట్టి లాగాడనేైందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ క్రమంలో గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించింది.