పేదరోగులకు సర్కారు మరోమారు శుభవార్త చెప్పింది. నేటినుండి టీ-డయాగ్నిస్టిక్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యానికి వచ్చే రోగులు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో టీ-డయాగ్నస్టిక్ ను ప్రారంభించారు. ఈ సెంటర్లలో టెస్టుల సంఖ్యను నేటినుండి 134కు పెంచనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు వైద్య సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యోచిస్తుంది. అన్ని జిల్లాల్లో బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు చేరువలో వైద్యసదుపాయం కల్పిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రభుత్వ ఆస్పత్రులలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు ప్రభుత్వం తెలుపుతుంది. జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం పలుమార్లు తెలిపారు.చాలావరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ముందుకన్న సేవలు ఇప్పడు బాగా ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలకు కేసీఆర్ కిట్, గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్.. మొదలైన స్కీమ్స్ తెలంగాణలో అమలు చేస్తున్నారు. తాజాగా పేదరోగులకు సర్కారు మరోమారు శుభవార్త చెప్పింది. నేటినుండి టీ-డయాగ్నిస్టిక్ సేవలు మరింత విస్తరించనున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యానికి వచ్చే రోగులు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో టీ-డయాగ్నస్టిక్ ను ప్రారంభించారు. ఈ సెంటర్లలో టెస్టుల సంఖ్యను నేటినుండి 134కు పెంచనున్నారు. ఇప్పటి వరకు 57 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు.
కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టులు ప్రైవేట్ ల్యాబ్‌లలో రూ.500 నుండి రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుందని వైద్యాధికారులు తెలిపారు. అవి సర్కార్ దవాఖానల్లో ఉచితంగా చేస్తారు. ఎక్స్ రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామ్మోగ్రామ్ తో పాటు తలసేమియా, అనీమియా, కాలా అజర్ హీమోఫీలియా వంటి వ్యాధులను గుర్తించే ప్రొఫైల్స్ వంటి టెస్టులు అందుబాటులోకి రానున్నాయి. మరో 8 జిల్లాల్లో కొత్తగా పాథాలజీ ల్యాబులు, 16 జిల్లాల్లో ఏర్పటు చేసిన రేడియాలజీ ల్యాబులు ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. వీటిని మంత్రి హరీశ్ రావు రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి నుండి ప్రారంభిస్తారు.