గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్, ఇండోనేషియా, న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో ఏ క్షణంలో భూకంపం వస్తుందో అన్న భయంతో ప్రజాలు భయాందోళనకు గురి అవుతున్నారు. గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో వరుస భూకంపాలతో జనాలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో భూకంపం సంభవించింది. శనివారం అర్థరాత్రి వరుసగా మూడు సార్లు భూమి కంపించడంతో జనాలు భయంతో వణికిపోయారు. మొదట 12.40 గంటలకు భూమి కంపించింది.. ఆ తర్వాత 12.45 కి మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ తర్వాత 1.01 ప్రాంతంలో మూడోసారి భూ ప్రకంపనలు రాడంతో ఏం జరుగుతుందో అని ప్రజలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ భూకం తీవ్రత 2.5 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపారు. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో దీని కదలికలు సంబవించినట్లు అధికారుల తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
ఇటీవల తరుచూ ఉత్తరాఖాండ్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. గురువారం పౌరి గర్వాల్ జిల్లాలో 2.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత ఏడాది ఉత్తర కాశీలో 3.1 తీవ్రతతో భూమి కంపించింది.. కాకపోతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఏది ఏమైనా ఇటీవల భూకంపం పేరు చెబితేనే ప్రజల వెన్నుల్లో వణుకు పుడుతుంది. టర్కీ, సిరియాలో భూకంపం వల్ల 50 వేల మంది మృతి చెందారంటే దీని తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది.