ప్రపంచ వ్యాప్తంగా ఈ మద్య వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ భూకంపాలు సంభవిస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం ఇంకా మరువకముందే పలు చోట్ల భూకంపాలు వస్తున్నాయి.
భారత్ లో గత కొంత కాలంగా వరుస భూకంపాలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తారాఖాండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా పరిసర ప్రాంతాలల్లో పలుమార్లు భూమి కంపిస్తున్న విషయం తెలిసిందే. శనివారం ఉత్తరాఖండ్ లో వరుస భూకంపాలతో జనాలు ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 2.5 గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఆదివారం మళ్లీ భూకంపం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవల జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భూకంపం సంభవించింది.. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇంట్లో సామాన్లు కదిలిపోయాయి.. భయంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.9 గా నమోదు అయ్యింది. భూమి లోపల 10 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టుగా సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినల్లు తెలియరాలేదు. గతంలో పలు మార్లు జమ్మూకాశ్మీర్ లో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. జనవరి 19వ జమ్మూ కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.2గా నమోదైన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇటీవల ప్రపంచంలో పలు దేశాల్లో భూకంపాలు జనాలక కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప ప్రళయాన్ని తల్చుకుంటే ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు. భారత్, ఇండోనేషియా, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో భూకంపాలు ఎక్కువగా సంబవిస్తున్నాయి. భూమి లోపల ఉండే పలకలు నిరంతరం తిరగడం.. తరుచూ ఢీ కొనడం వల్ల విచ్చిన్నమై ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది.. దాని ప్రభావం వల్లనే భూకంపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Earthquake of Magnitude:3.9, Occurred on 05-03-2023, 06:57:12 IST, Lat: 34.42 & Long: 74.88, Depth: 10 Km ,Location: 38km N of Srinagar, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/kpZw8lSGSd @Indiametdept @ndmaindia @moesgoi @Ravi_MoES pic.twitter.com/JhEYPRvRJx
— National Center for Seismology (@NCS_Earthquake) March 5, 2023