సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వైరల్ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు తమ టాలెంట్ తో నెటిజన్లను అలరిస్తున్నారు.
ఇక టిక్ టాక్ వచ్చిన తర్వాత చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. కొంత మంది డ్యాన్స్ లో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేస్తూ దుమ్మురేపుతున్నారు. ముగ్గురు మహిళలు సంప్రదాయబద్ధమైన భరత నాట్యంలో, హిప్ హాప్ డ్యాన్స్ ను వీరు మిక్స్ చేసి కొట్టి స్టెప్పులు వేశారు.
నాకు డ్యాన్స్ అంటే ఎంతో అభిమానం.. ఈ రెండు రకాల డ్యాన్సులు చాలా అద్భుతంగా ఉన్నాయి. టాలెంట్ ఉన్న మహిళలను ప్రోత్సహించడం నేను ఎంతో గర్వంగా భావిస్తాను అంటూ అని ఉష పోస్ట్ చేశారు. ఎంతో గొప్ప టాటెంట్ ప్రదర్శించిన ఈ మహిళలపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.