ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాజకీయ దురంధరుడు కొణిజేటి రోశయ్య గెండెపోటుతో మృతి చెందారు. ఆంధ్రా ఉద్యమంతో తన రాజకీయ జీవితం ప్రారంభించి, కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతోనే చట్టసభల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. తన రాజకీయ జీవితం ఆద్యంతం అత్యున్నత విలువలు కట్టుబడి ఉండట ఆయన గొప్పదనం. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించి సమయపాలన, క్రమశిక్షణ, సంస్కారం ఉన్న వ్యక్తి అని పేరు తెచ్చుకున్నారు. రోశయ్య కన్నుమూత పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
‘ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు’ ట్వీట్ చేశారు. ‘ఓరూ, నేర్పు కలిగిన మంచి వక్తగా శ్రీ రోశయ్య గారు అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు’అంటూ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ వర్గాల వారు ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా శ్రీ రోశయ్య గారు అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.
— Vice President of India (@VPSecretariat) December 4, 2021
పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా… సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను🙏 pic.twitter.com/XcVAukC90M
— KTR (@KTRTRS) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మరణం బాధాకరం. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులు అలంకరించి, అమూల్యమైన సేవలు అందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/22LleKkjaU
— Harish Rao Thanneeru (@trsharish) December 4, 2021
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రోద్యమంతో రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్యగారు ఐదు దశాబ్దాల పాటు ఎంతో అనుభవాన్ని గడించారు. సుదీర్ఘకాలం రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అద్భుతమైన సేవలు అందించారు.(1/2) pic.twitter.com/09y6g05znW
— N Chandrababu Naidu (@ncbn) December 4, 2021
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను.సమున్నత వ్యక్తిత్వం,విషయపరిజ్ఞానం కలిగి,విలువలు పాటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రోశయ్య.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/1S3haYIz1g
— Lokesh Nara (@naralokesh) December 4, 2021
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021