పంద్రాగస్టు వచ్చేస్తోంది. దేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకల్లో మునిగి తేలనుంది. ఎర్రకోట సాక్షిగా మువ్వన్నెల జాతీయ జెండా ఎగురనుంది. అయితే ఈ మువ్వన్నెల జెండా గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం..
పంద్రాగస్టు వేడుకలు అంత సులభంగా వచ్చినవి కావు. 200 ఏళ్ల బ్రిటీషు పాలన నుంచి విముక్తి పొందేందుకు చేసిన స్వాతంత్ర్య పోరాటం ఫలితం ఇది. దేశంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియా ఈ ఏడాది 79వ ఇండిపెండెన్స్ డే జరుపుకోనుంది. ఈ క్రమంలో దేశమంతా వీధి వీధిలో వాడవాడలో ఎగురనున్న మువ్వన్నెల జాతీయ జెండా గురించి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
1. దేశంలో మొట్టమొదటి సారిగా జాతీయ పతాకం ఆవిష్కరించింది 1906 ఆగస్టు 7న కోల్‌కతాలోని పార్శీ బగాన్ స్క్వేర్ ప్రాంతంలో. ఆ సమయంలో జాతీయ జెండా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులతో ఉండేది.
2. 1931లో మువ్వన్నెల శాఫ్రాన్, వైట్, గ్రీన్ రంగులుండి మధ్యలో మహాత్మాగాంధీ రాట్నం బొమ్మతో ఉండే జెండాను జాతీయ పతాకంగా ప్రకటించారు.
3. 1947 జూలై 223న మరి కొన్ని మార్పులు చేసి మహాత్మా గాందీ స్థానంలో అశోక చక్ర ముద్రించిన జెండాను అధికారికం చేశారు. ఆగస్టు 15, 1947న తొలిసారిగా ఇదే జెండా ఎగురవేశారు.
4. 1904లో స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత తొలిసారిగా జాతీయ జెండాను డిజైన్ చేశారు.
5. 1911లో రవీంద్రనాధ్ ఠాగోర్ భారతో భాగ్యో విధాత పాటను కంపోజ్ చేసి తరువాత జన గణ మణగా మార్పు చేశారు.
6. జాతీయ జెండాలో కాషాయం అంటే శాఫ్రాన్ రంగు దేశం శక్తి సామర్ధ్యాలు, ధైర్యానికి ప్రతీక అయితే తెలుపు శాంతిని, సత్యాన్ని సూచిస్తుంది. ఇక ఆకుపచ్చ రంగు సారవంతాన్ని , అభివృద్ధిని సూచిస్తుంది.
7. 21 ఏళ్ల క్రితం అంటే 2004 వరకు ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ఇంకెప్పుడూ జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు భారతీయులకు అవకాశం ఉండేది కాదు. భారత పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ దశాబ్దానికి పైగా చేసిన న్యాయపోరాటం తరువాత సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
8. 2004, జనవరి 23న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ పతాకం గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడుతూ ఎవరైనా సరే ఎగురవేసే హక్కు కలిగి ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) ఇది కల్పిస్తుంది.
9. పంద్రాగస్టునాడు ఇండియాతో పాటు ఇండిపెండెన్స్ డే జరుపుకునే దేశాలు రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, లీచెస్టెయిన్, బహ్రెయిన్