ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భూకంపం ఎంత ఘోరమైన విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ భూకంప ప్రభావం వల్ల ఇప్పటి వరకు 44 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. ఈ భూకంప పలుమార్లు సంబవిస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.
ఇటీవల ప్రపంచాన్ని భూకంపాలు గజ గజ వణికిస్తున్నాయి. ఈ ఏడాది టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప ప్రళయంలో మృతుల సంఖ్య 44 వేలకు చేరింది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 4 గంటలకు టర్కీ, సిరియా లో భారీ భూకంపం ఎంతటి ప్రళయాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ శిథిలాల కింద నుంచి మృతదేహాలను తీస్తూనే ఉన్నారు. ఇక్కడ భూకంపాలు తరుచూ సంబవిస్తూనే ఉన్నాయని.. మొదటి సారిగా 7.8 తీవ్రత రాగా.. తర్వాత 6.0 వీవ్రతతో పలుమార్లు భూమి కంపించిందని తుర్కియే ప్రభుత్వం ప్రకటించింది. ఈ భూకంప సంఘటన ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ భూకం ప్రభావంతో ఓ గ్రామం రెండుగా చీలిపోయింది. ఈ ఘటన అన్ టాకియా నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఈ నెల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భూకంపం భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. భూకంప ప్రభావం ఈ దేశాల్లో ఎంత ఘోరంగా చూపించిందో తెలియడానికి తుర్కియే లోని అన్ టాకియా నగరంలో దెమిర్ కోప్రే అనే గ్రామం నిలువెల్ల సాక్ష్యంగా నిలుస్తుంది. తుర్కియే దేశంలో వరుసగా వచ్చిన భూకంప ప్రభావం వల్ల ఓ గ్రామం రెండుగా చీల్చబడింది. భూమి చీలిపోవడంతో 13 అడుగుల తోలులోకి ఇళ్లు కూరుకు పోయాయి. ఒక్కసారే భూమి చీలిపోవడంతో అక్కడే ఉన్న కొన్ని జంతువులు అందులో కూరుకుపోయాయి చనిపోయాయి. కొన్ని చోట్ల భవనాలు భూమిలోకి కూరుకు పోవడంతో ప్రజలు అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని.. ఇళ్లల్లోకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని గ్రామస్థులు తెలిపారు.
పలుమార్లు భూమి కంపిస్తూ ఉండటంతో నీరు పైగి రావడం.. దాంతో అంతటా బురుద ప్రవహిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వెయ్యి మంది నివసిస్తున్న గ్రామంలో ఇప్పటి వరకు ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భూకంపం పలుమార్లు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నామని గ్రామస్తులు తెలిపారు. శనివారం రిస్క్యూ టీమ్ ప్రాణాలతో ఉన్నవారిని గాలిస్తున్నా ఎవరినీ గుర్తించలేకపోయారు. ఈ నేపథ్యంలో తుర్కియేలో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. శిథిలాలను తొలగించేందుకు ఇక యంత్రాలను ఉపయెగించేందకు సిద్దమవుతున్నట్లు సమాచారం.