Strange Habit: చిన్న తనంలో ఎవరికైనా దగ్గు విపరీతంగా ఉండి.. ఎంతకూ తగ్గకపోతే పెద్దలు ఓ సలహా ఇచ్చేవారు. ఎవరి మూత్రం వారు తాగితే దగ్గు తగ్గిపోతుందని చెప్పేవారు. చాలా మంది దీన్ని ఫాలో అయ్యేవారు. ఇప్పటికీ కొన్ని పల్లెటూర్లలో దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. కొంతమంది తల్లులు చంటి బిడ్డల విషయంలోనూ ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మూత్రం కారణంగా దగ్గు తగ్గుతుందనటానికి సరైన సైంటిఫిక్ ఆధారాలు లేవు. అలాంటిది.. కొంతమంది మూత్రం ద్వారా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు.
అలాంటి వారిలో వరల్డ్ ఫేమస్ సింగర్, నటి మడోనా, సింగర్ కేశ వంటి వారు కూడా ఉన్నారు. వీరు అప్పుడప్పుడు తమ మూత్రాన్ని తాగుతుంటారు. కానీ, ఓ వ్యక్తి వీరిని మించిపోయి ప్రతీ రోజు మూత్రాన్ని తాగుతున్నాడు. అలా తాగటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని హ్యాంప్ షేర్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మటడీన్‌కు ఓ వింత అలవాటు ఉంది. ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల తన మూత్రాన్ని తానే తాగుతాడు. అది కూడా నెల రోజుల పాటు దాచిన మూత్రాన్ని తాగుతాడు. బాటిళ్లలో, సీసాల్లో మూత్రాని భద్రంగా దాచుకుంటాడు. బీరులా వాటిని సిప్ చేస్తూ తాగుతాడు. ఇలా 2016 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
ఎందుకలా చేస్తున్నావని ఎవరైనా అడిగితే.. అలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నాడు. మూత్రం తాగిన వెంటనే ఎంతో ప్రశాంతంగా ఉంటోందని అంటున్నాడు. మూత్రం తాగటం వల్ల కలిగే లాభాలపై ఏకంగా ఓ పుస్తకం కూడా రాశాడు. అంతేకాదు! తన మూత్రాన్ని ముఖంపై కూడా చల్లుకుంటాడు. ఇలా చేయటం ద్వారా నిత్య యవ్వనం ప్రాప్తిస్తుందని అంటున్నాడు. అయితే, మూత్రాన్ని తాగటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వాంతులు, వికారం, విరేచనాలు, డీహైడ్రేషన్ కలిగే అవకాశం ఉందంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్లు కూడా సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి, హ్యారీ వింత అలవాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇంకా చదవండి : 30 ఏళ్లుగా టాయిలెట్‌లోనే సమోసాలు రెడీ చేసిన రెస్టారెంట్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.