జైల్లోని ఖైదీలతో 18 మంది మహిళా గార్డులు లైంగిక సంబంధం పెట్టుకున్నారు. గత ఆరేళ్లుగా సాగుతున్న ఈ చీకటి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాక సదరు మహిళలను విధుల నుంచి తొలగించి.. జైలుకు పంపారు.
వివిధ రకాల నేరాల్లో దోషులుగా తేలిన వారిని కోర్టు విధించిన శిక్ష ప్రకారం జైళ్లలో ఉంచుతారు. వీళ్లు పారిపోకుండా ఉండేందుకు జైళ్లు సిబ్బంది నిత్యం కాపలా ఉంటారు. ఇలా జైళ్లలో విధులు నిర్వహించే వారిలో పురుషులతో పాటు మహిళలు ఉంటారు. అయితే కొన్ని జైళ్లలో వివిధ లోపాలు ఉంటాయని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అయితే ఓ ప్రాంతంలోని జైల్లో ఘోరం జరిగింది. ఖైదీల పట్ల కఠినంగా ఉండాల్సిన మహిళ గార్డులు.. వారితోనే శృంగారంలో పాల్గొన్నారు. ఏకంగా 18 మంది మహిళా గార్డులు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో రాసక్రీడలు నడిపారు. చివరకు బయటకి రావడంతో జైళు పాలయ్యారు. ఈ ఘోరమైన ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బ్రిటన్ దేశంలోని వేల్స్ నగరంలో పటిష్ట భద్రత కలిగిన హెచ్ఎంపీ బెర్విన్ లైంగిక సంబంధాలు జరిగాయి. ఈ జైళ్లో 18 మంది మహిళా గార్డులు ఖైదీలతో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అవి నిజమని తేలడంతో వారందరిని అధికారులు విధుల నుంచి తొలగించారు. గత ఆరు సంవత్సరాలుగా ఈ జైళ్లులో లైంగిక సంబంధాలు జరిగాయి. చివరకు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణ జరిపించి దోషులను పట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళా గార్డులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు ముగ్గురు మహిళలకు జైలు శిక్ష విధించింది.
లైంగిక సంబంధాలు కలిగిన వారిలో జెన్నిఫర్ అనే మహిళా గార్డు ఉంది. ఆమె .. అలెక్స్ కాక్సన్ అనే దొంగ సెల్ లోకి ఫోన్ ను అక్రమంగా పంపించడానికి సహకరించింది. వీరిద్దరు వాట్సాప్ ద్వారా విపరీతమైన స్నాప్ లను మార్పిడి చేస్తూ అధికారులకు పట్టుబడ్డారు. గవాన్ అనే వ్యక్తి ఓ నేరం కింద ఎనిమిది నెలల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎమిలీ వాట్సన్, అయేషీయా అనే మహిళా గార్డులు ఖైదీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో .. వారికి శిక్షపడింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ మరణానికి కారణమైనందుకు డ్రగ్ డీలర్ జాన్ మెక్ గీ కు జైలు శిక్షపడింది. ఆ ఖైదీ ఎనిమిదేళ్ల నుంచి జైళ్లు శిక్ష అనుభవిస్తున్నాడు.
జాన్ తో కొందరు మహిళా గార్డులు లైంగిక సంబంధం కలిగి ఉన్నారు. అయేషీయా అనే ప్రొబేషన్ ఆఫీసర్… ఖురామ్ రజాక్ అనే సాయుధ దొంగతో శృంగారంలో పాల్గొంది. ఆ సమయంలో వారు దిగిన ఫోటోలు, వీడియోలను వీరిద్దరు మార్చుకున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు ఇంగ్లాండ్, వేల్స్ లో దాదాపు 31 మంది మహిళా అధికారులను వివిధ రకాల అనైతి సంబంధాల కలిగి ఉన్నారనే కారణంగా విధుల నుంచి తొలగింబడ్డారు. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.