గత ఏడాది నేపాల్ లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా ప్రాణ నష్టమే కాదు.. బారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఏడాది టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో కోట్ల నష్టమే కాదు.. 50 వేల మంది మరణించారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ భూకంపాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఒక దశలో భూకంపం పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. గత నెల టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో కోట్ల నష్టమే కాదు.. 50 వేల మంది మరణించారు. అఫ్గానిస్థాన్‌లో గురువారం తెల్లవారుజామున ఫైజాబాద్ సమీపంలో భూకంపం సంభవించింది.. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.1 గా నమోదు అయ్యింది. తాజాగా మెక్సికోని భారీ భూకంపం గజ గజ వణికించింది. మెక్సికో లోని ఓక్సాకా పరిసర ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉదయం అఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో భూకంపం సంబవించింది. మరోవైపు మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.7 గా నమోదు అయినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వారు తెలిపారు. భూమికి 10 కిలోమీటర్ల దూరం లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు ఈఎంఎస్ సీ అధికారులు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని ఈఎంఎస్‌సీ వెల్లడించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఇళ్లను విడిచి రోడ్డు మీదకు పరుగులు తీశారు జనాలు. ఇళ్లలో వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయాందోళనకు గురైనట్లుగా స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది నేపాల్, భారత్, ఇండోనేషియాలో పలుమార్లు భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెలలో ఢిల్లీ, ఉత్తరాఖాండ్, ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే.
Felt #earthquake M 5.7 – OAXACA, MEXICO – 2023-03-02 04:40:44 UTC pic.twitter.com/3CZ6lXvAlv
— SSGEOS (@ssgeos) March 2, 2023