ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు వరుసగా సంబవిస్తున్నాయి. భూకంపాల ప్రభావంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం వల్ల 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 1500 మందికి పైగా గాయపడ్డారు. భారత్ లో కూడా ఈ మద్య భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో శనివారం భారీ భూకంపం వచ్చింది. అలాగే చైనాలోనూ భూకంపం వచ్చింది. అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున హర్మోజ్‌గంజ్ ప్రావిన్స్‌లోని ఓడరేవు పట్టణం బందర్ అబ్బాస్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, 44 మంది గాయపడ్డారు. ఇది వందమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. తెల్లవారుజామున ఈ ఘటన జరగడం వల్ల భయంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భూకంప ధాటికి కొన్ని భవనాలు, రోడ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ముమ్మురంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
గతంలో ఇరాన్ లో భారీ భూ కంపాలు సంబవించి.. ఎంతో ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ భూకంపాలు రావడం.. తీవ్ర నష్టం వాటిల్లడానికి గల కారణం ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ యాక్టివిటీ ఎక్కువగా అంటున్నారు అధికారులు. ఇక చైనాలో కూడా శనివారం తీవ్ర భూకంపం సంబవించిందని.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: Bhadradri Kothagudem: దారి మధ్యలో ఆగిపోయిన అంబులెన్స్.. గాల్లో కలిసిన యువతి ప్రాణాలు