ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు భయపెడుతున్నాయి. ఈ నెల 6న టర్కీ, సిరియాలో సంబవించిన భూకంపం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు 42 వేల వరకు మరణాలు సంబవించాయని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు..
ప్రపంచంలో ఇప్పుడు ప్రజలు భూకంపం అనే పేరు వినిపిస్తే చాలు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఈ నెల ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 4 గంటలకు టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు ఎంత ప్రళయాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే. టర్కీ, సిరియాలో ఎక్కడ చూసినా హాహాకారాలు.. శవాల దిబ్బలు. ఇప్పటి వరకు 42 వేల మంది చనిపోయారని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ టర్కీ, సిరియా ప్రాంతంలో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. నిన్న న్యూజిలాండ్ లో వెల్లింగ్టన్ సమీపంలో భూకంపం సంబవించింది. ఇదిలా ఉంటే గురువారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంబవించింది.. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది.
ఇటీవల ప్రపంచ దేశాల్లో పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కలుగుతుంది. ఫిలిప్పిన్స్ లో భారీ భూకంపం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఫిలిప్పీన్స్ లో భూకంపం సంబవించిందని.. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదు అయ్యిందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. మియాగా గ్రామానికి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపారు.
తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న ప్రజలు భూ ప్రకంపణలు రాడంతో ఒక్కసారిగా వణికిపోయారు. భయంతో బయటకు పరుగులు తీశారు. ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందన్న విషయంపై స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఇటీవల వరుస భూకంపాలతో టర్కీ, సిరియా కకావికలం అయ్యింది. ఇప్పటికే 42 వేల మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. శిథిలాల కింద నుంచి ఎంతోమందిని రెస్క్యూ టీమ్ కాపాడుతున్నారు.. శవాల మద్యనే ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు దేశాలు టర్కీ, సిరియాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
బుధవారం న్యూజిలాండ్ లో వెల్లింగ్టన్ భారీ భూకంపం సంబవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదు అయ్యింది.. ఇప్పటికే న్యూజిలాండ్ లో గాబ్రియెల్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ ఉత్తర ద్విపం చిగురుటాకులా వణికిపోయింది. దానికి తోడు భూకంపం ప్రకంపణలు సృష్టించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ భూకంపాల ప్రభావం మరింత ఉండబోతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు.
Earthquake Of 6.1 Magnitude Hits Central Philippines, No Casualties https://t.co/xEDLjeJ7XS pic.twitter.com/DbeOGUi5kv
— NDTV News feed (@ndtvfeed) February 16, 2023