ప్రపంచాన్ని ఇప్పుడు భూకంపాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏక్షణంలో భూకంపాలు వస్తాయో అన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల భారత్, ఇండోనేషియా, నేపాల్, అప్ఘనిస్తాన్, ఫిలిప్పిన్స్ లాంటి దేశాల్లో తరుచూ భూకంపాలు రావడం చూస్తూనే ఉన్నాయం. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి.
ప్రపంచ దేశాలను ఇప్పుడు భూకంపాలు భయపెడుతున్నాయి. ఈ నెల 6న టర్కీ, సిరియాలో సంబవించిన భూకంపం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటి వరకు 42 వేల వరకు మరణాలు సంబవించాయని.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంటున్నారు..