సాధారణంగా దొంగలను,హంతకులను పోలీసులు పట్టుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో మనుషులు పట్టిస్తారు. కానీ వింతగా.. ఓ దోమ ఓ గజదొంగను పట్టించింది. వినడానికి, చదవడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే. ఈ ఘటనకు చైనాలో చోటు చేసుకుంది. అంత పెద్ద మనిషిని, అతి చిన్న దోమ ఎలా పట్టించింది? అసలు ఆ దొంగ ఏం చేశాడు? అనే సందేహాలు అందరికి వ్యక్తమవుతాయి.అందుకే ఈ కేసుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ఆ పోలీసుల ఐడియాను మెచ్చుకుంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
చైనాలోని ఫూజియన్ ప్రావిన్సులో ఫూజ్ అనే పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ దొంగ చొరబడ్డాడు. అందులో ఎవరూ లేని ఇంటిని ఎంచుకుని బాల్కానీ మీదుగా లోపలికి ప్రవేశించాడు. ఈక్రమంలో అప్పటికే ఆకలితో ఉన్న ఆ దొంగ ఆహారం కోసం చూశాడు. దీంతో ముందుగా వంటింట్లోకి వెళ్లి.. అక్కడే ఉన్న కోడి గుడ్లు, న్యూడుల్స్ తో ఎగ్ న్యూడుల్య్ చేసుకుని ఆకలి తీర్చుకున్నాడు. ఈక్రమంలో అక్కడే కొద్ది సేపు నిద్రకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో తనపై వాలిన ఓ దోమను కొట్టి చంపాడు. అంతే కాకుండా అతడు అల్మరాలోంచి ఓ దుప్పటి తీసి కప్పుకొని, ఓ మస్కిటో కాయిల్ వెలిగించాడు. తెల్లవారుజామునే లేచి ఇంట్లో ఉన్న వస్తువులను అందినకాడిడి దోచుకెళ్లాడు.
ఈక్రమంలో ఇంటి వచ్చిన యాజమాని.. వస్తువులు చెల్లచెదురుగా పడి ఉండటంతో దొంగతనం జరిగనట్లు గ్రహించాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి వచ్చిన పోలీసులు చోరికి గురైన వస్తువుల వివరాలు తెలుసుకున్నారు. ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. అనంతరం ఇంటినంతటిని క్షుణంగా పరిశీలించారు. ఈ క్రమంలో ఓ దోమ గోడపై రక్తపు మరకలతో అత్కుపోయి ఉంది. గమనించిన పోలీసులు.. దీని ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆ రక్త నమూనాను ఫోర్సెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
డీఎన్‌ఏ విశ్లేషణలో దోమలోని ఆ రక్తం “చే” అనే పాత నేరస్తుడితో సరిపోలడంతో అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ స్థానిక పోలీసులపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ ఐడియా సూపర్ సార్ అంటూ పొగడ్తలో ముంచెత్తారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.