అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు. అచ్చం అలాంటి ఓ బ్యాడ్ లక్ ఫెలో స్టోరీ ఇది. మనలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. అయ్యో ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను. ఈ మాయదారి వైరస్ నాకే రావాలా? బ్యాడ్ టైమ్ అంటూ తెగ బాధపడిపోతాము. కానీ.., 10 నెలల గ్యాప్ లో 43 సార్లు పాజిటివ్ వస్తే అతన్ని ఏమనాలి? ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల డేవ్ స్మిత్ ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయి ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఇంతలో మాయదారి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది.
తాను ఇంట్లోనే ఉంటున్నాను కదా..? నాదాక ఆ వైరస్ రాదులే అని డేవ్ స్మిత్ దైర్యంగా ఉంటూ వచ్చాడు. కానీ.., గత ఏడాది మార్చిలోనే ఇతనికి కరోనా సోకింది.ఇంట్లోనే క్వారంటైన్ ఉంటూ చికిత్స తీసుకున్నాడు. కానీ.., వ్యాధి మాత్రం తగ్గలేదు. చివరికి రుచి వాసన శక్తిని కోల్పోయాడు డేవ్ స్మిత్. దీంతో.., తప్పక హాస్పిటల్ లో జాయిన్ అయ్యి, ఓ వారం రోజుల చికిత్స తరువాత రికవరీ అయ్యి ఇంటికి వచ్చాడు. మాములుగా అయితే.., ఇక్కడితో డేవ్ స్మిత్ కరోనా నుండి బయటపడినట్టే. కానీ.., ఇంటికొచ్చిన కొన్ని రోజులకే డేవ్ స్మిత్ కి ఆరోగ్యం చెడిపోయింది. మళ్ళీ అవే కరోనా లక్షణాలు. దీంతో.., గత ఏడాది జులైలో రెండోసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఆయనకి రెండోసారి పరీక్ష చేస్తే పాజిటివ్ అని వచ్చింది. ఇలా 10 నెలల్లో 43 సార్లు టెస్ట్ చేస్తే.. 43 సార్లు పాజిటివ్ అనే వచ్చింది. ఈ ఫలితాలను చూసి డాక్టర్స్ సైతం షాక్ కి గురయ్యారు. దీంతో.., లండన్ వైద్యులు ఈకేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు.
చివరి చికిత్సగా రెజినెరాన్ యాంటిబాడీ థెరపీని ప్రారంభించారు. దీనికి ఆయన శరీరం సానుకూంగా స్పందించింది. మరోవైపు నర్స్ లు ఆయనకి మంచి మాటలు చెప్తూ.., గుండె దైర్యం కోల్పోకుండా చేశారు. మొత్తం 305 రోజుల పాటు ఆ ఆస్పత్రి వైద్యులు డేవ్ స్మిత్ కోసం అన్నీ కష్టాలు పడ్డారు. ఇలా 305 రోజున కరోనా పరీక్ష చేయగా ఫలితం నెగటివ్ గా వచ్చింది. డాక్టర్స్ మరిన్ని పరీక్షలు చేసినా నెగటివ్ రావడంతో డేవ్ స్మిత్ కరోనాని జయించాడని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ విషయం పట్ల డేవ్ స్మిత్ వైద్య బృందానికి చేతులు ఎత్తి నమస్కరించాడు. చావు అంచుల వరకు వెళ్లిన తనని డాక్టర్స్ బతికించారని ఆనందం వ్యక్తం చేశాడు. మరి ఓ వ్యక్తి ప్రాణం కోసం ఇంతలా కష్టపడ్డ డాక్టర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.